హాలీవుడ్ మూవీలో రామ్ చరణ్ ఎప్పుడంటే?

Sat Mar 18 2023 10:15:54 GMT+0530 (India Standard Time)

Ram Charan in a Hollywood movie when

ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రామ్ చరణ్ కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు అమెరికా నుండి ఇండియా వచ్చిన చెర్రీ దిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన హాలీవుడ్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.



ఇండియా టుడే కాంక్లేవ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రామ్ చరణ్ ని హాలీవుడ్ ప్రాజెక్టు గురించి అడిగారు. తన హాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పడం ఇష్టం లేదంటూ సైలెంట్ గా ఉన్నా.. రాజ్ దీప్ వదిలిపెట్టలేదు. దీంతో హాలీవుడ్ కు వెళ్లడమనేది తప్పకుండా జరుగుతుందని చెప్పాడు.

హాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందని చెర్రీ చెప్పుకొచ్చాడు. చూస్తున్నామని చేస్తున్నామని తప్పకుండా హాలీవుడ్ సినిమాలో నటిస్తానని రామ్ చరణ్ చెప్పాడు. మీ అంచనాలు తప్పకుండా అందుకుంటామని మీ కోరికలను తప్పకుండా నిజం చేస్తానని రామ్ చరణ్ చెప్పాడు.

మీరు ఏదైనా ప్రాజెక్టుపై సంతకం చేశారా అని రాజ్ దీప్ అడగ్గా.. అదంతా ప్రాసెస్ లో ఉందని రామ్ చరణ్ సమాధానం ఇచ్చాడు. సౌత్ జనాలు అంచనాలు తక్కువగా ఉంచుతారని ఒక్కసారిగా అంచనాలను పటాపంచలు చేస్తారని రాజ్ దీప్ అన్నారు. మావెరిక్ 3 లో టామ్ క్రూజ్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నట్లు మనం వినవచ్చని రాజ్ దీప్ చమత్కరించారు.

దానిపై నవ్వుతూ సమాధానమిచ్చిన చెర్రీ.. ఆప్కా నజర్ నహీ లగ్నా చాహీయే అని తల్లి తనకెప్పుడు చెబుతుండేదని జవాబిచ్చాడు. హాలీవుడ్ లో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని అందుకు తానేం మినహాయింపు కాదని రామ్ చరణ్ స్పష్టంగా చెప్పాడు. ఆస్కార్ వేడుకలకు ముందు పలు టీవీ షోలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రామ్ చరణ్.. అక్కడ కూడా తనకు హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. త్వరలోనే తనను హాలీవుడ్ సినిమాల్లో చూడొచ్చని అన్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.