రంగస్థలంకి మించి బుచ్చి బాబు సినిమా

Sat Mar 18 2023 09:16:22 GMT+0530 (India Standard Time)

Ram Charan about BuchiBabu Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డు మూడ్ ని ఆశ్వాదిస్తున్నారు అని చెప్పాలి. గ్లోబల్ స్టార్ గా వచ్చిన ఇమేజ్ ని కూడా మరింత గ్రాండియర్ గా షోకేస్ చేసుకోవడానికి పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ఒప్పుకోవాలని అనుకుంటున్నాడు. కచ్చితంగా తన నుంచి ఆడియన్స్ ఇకపై యూనివర్శల్ కథలని మాత్రమే కోరుకుంటారు. ఈ నేపధ్యంలో అలాంటి వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు. అయితే ప్రస్తుతం కొరటాల శివకి తారక్ కమిట్మెంట్ ఇవ్వడం వలన ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండటం బుచ్చిబాబుకి రామ్ చరణ్ ని రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో చెర్రికి బుచ్చిబాబు కథ చెప్పి ఒకే చేయించుకున్నారు.

ఈ ఏడాదిలోనే ఈ మూవీని స్టార్ట్ చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రామ్ చరణ్ తాజాగా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరియర్ లో భాగా నచ్చిన సినిమా రంగస్థలం కంటే ఇంకా బెటర్ గా బుచ్చిబాబు మూవీ ఉంటుందని చెప్పాడు. కచ్చితంగా అతనితో చేయబోయే మూవీ నా కెరియర్ లో మరో బెస్ట్ మూవీగా మారడం మాత్రం ఖాయం అని చరణ్ చెప్పినట్లు తెలుస్తుంది.

 ఈ మూవీ తర్వాతనే చరణ్ ఇప్పటికే చర్చలు జరుపుతున్న హాలీవుడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఒక వేళ అది కాకుంటే నార్తన్ దర్శకత్వంలో గాని లేదంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కాని చరణ్ సినిమా ఛాన్స్ ఉందని తెలుస్తుంది. రంగస్థలం కంటే బెస్ట్ స్టొరీ అని బుచ్చిబాబు గురించి చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మేదిలో వైరల్ గా మారాయి. దీంతో దానికి సంబందించిన అప్డేట్ కావాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.