Begin typing your search above and press return to search.

శర్వానంద్ నిశ్చితార్థంలో రామ్ చరణ్, ఉపాసన..!

By:  Tupaki Desk   |   26 Jan 2023 12:38 PM GMT
శర్వానంద్ నిశ్చితార్థంలో రామ్ చరణ్, ఉపాసన..!
X
ఐదో తారీఖు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన యంగ్ హీరో శర్వానంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఆయన ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు రక్షిత రెడ్డిని హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు.

అయితే ఈరోజే వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజు ఉదయం 11.04 నిమిషాలకు శర్వానంద్, రక్షితలు ఉంగరాలు మార్చుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని హుడా హైట్స్ లో వీరి ఎంగేజ్ మెంట్ బంధువులు, స్నేహితుల మధ్య సాగుతోంది. ఈ క్రమంలోనే శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరు అయ్యాడు. కాబోయే వధూవరిలిద్దరితో కలిసి ఫొటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆఫ్ వైట్ కూర్తా లో శర్వా మిలమిలా మెరిసిపోతుండగా... స్కై బ్లూ కలర్ డిజైనర్ పట్టు చీరలో రక్షిత చందమాల కనిపిస్తోంది.చరణ్ అండ్ ఉపాసన బేబీ పింక్ కలర్ మ్యాచింగ్ బట్టలు వేసుకొని శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో క్యూట్ గా కనిపించారు. ఈ ఫొటోలు చూసిన అభిమాలు శర్వా, రక్షితలు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లి ఎప్పుడో కూడా చెప్పండంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే చెర్రీ, ఉప్పీలు కూడా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్న శర్వా ఓ ఇంటి వాడు కావడంతో ఆయన అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అయితే శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత.. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోందట. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈమె వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. వీరి పెళ్లి ఏప్రిల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. కానీ వీరిది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది మాత్రం తెలియట్లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.