'ఆచార్య' అప్డేట్: ధర్మ యుద్ధం కోసం తుపాకీ పట్టిన కామ్రేడ్ సిద్ధ..!

Wed Nov 24 2021 16:37:48 GMT+0530 (IST)

Ram Charan Teaser From Acharya On Nov 28th

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సిద్ధ క్యారక్టర్ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'ఆచార్య' సినిమాలో సిద్ధ సాగా క్యారక్టర్ టీజర్ ని నవంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ధర్మమే సిద్ధ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ గెటప్ లో చేతిలో తుపాకీ పట్టుకొని తీవ్రంగా చూస్తున్నారు.

బ్యాగ్రౌండ్ లో మెగాస్టార్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా 'సిద్ధ అనేక కారణాల వల్ల నాకు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. పవర్ ఫుల్ టీజర్ రాబోతుంది' అని చరణ్ పేర్కొన్నారు.

కాగా కొరటాల శివ గత చిత్రాల తరహానే సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'ఆచార్య' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఇందులో దేవాదాయ భూముల కుంభకోణం గురించి ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెజీనా కసండ్రా - సంగీత ప్రత్యేక గీతాల్లో కనిపిస్తుండగా.. సోనూసూద్ - జిషు షేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చిరంజీవి - చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది.