Begin typing your search above and press return to search.

చరణ్ - కొరటాల కాంబో సెట్ కానుందా...?

By:  Tupaki Desk   |   21 Oct 2020 6:30 AM GMT
చరణ్ - కొరటాల కాంబో సెట్ కానుందా...?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి 2013లో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిధులుగా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఏమైందేమో ఏమో కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మంగళం పడేశారు. ఆ తర్వాత చరణ్ - కొరటాల ఇద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ - కొరటాల శివ కలయికలో ఓ మూవీ రానుందని తెలుస్తోంది.

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమా రూపొందిస్తున్నాడు. కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా చరణ్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అదే సమయంలో కొరటాల శివ నెక్స్ట్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేశాడు. దీంతో అప్పుడు మిస్ అయిన చరణ్ - కొరటాల కాంబినేషన్ ఇక కష్టమే అనుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం 'ఆచార్య' మరియు బన్నీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కొరటాల శివ.. రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడట. ఈ చిత్రానికి కొరటాల క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారట. కొరటాల త్వరలో స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి చరణ్ కి వినిపించనున్నాడని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ 2022లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.