నవ్వులు పూయిస్తున్న కలర్ ఫుల్ 'అనుభవించు రాజా' టీజర్..!

Thu Sep 23 2021 10:46:00 GMT+0530 (IST)

Ram Charan Launched Anubhavinchu Raja Teaser

రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ''అనుభవించు రాజా''. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొన్ని రోజుల క్రితం కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైన 'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు గురువారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. 'అనుభవించు రాజా..' అంటూ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుండగా.. రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా పరిచయం చేయబడ్డాడు. అతను రికార్డింగ్ డ్యాన్స్ ల్లో డ్యాన్స్ చేయడం.. బెట్టింగ్ జూదం పేకాట ఆడటం కనిపిస్తుంది.

"అయినా బంగారం గాడు ఊర్లోని ఆడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొకడు గెలవడం కష్టం..." అని మీసాలు తిప్పుతూ రాజ్ తరుణ్ ప్రగల్భాలు పలుకుతూ కనిపించాడు. 'యాక్టన్ చేయాలి.. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు' అని సహచరుడు బంగారం గాడికి కౌంటర్ వేయడం నవ్వు తెప్పిస్తోంది. ఇక టీజర్ చివర్లో 'నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా' అంటూ పందెం పుంజుతో మాట్లాడటం అలరిస్తోంది.

ఎనర్జిటిక్ గా ఉండే రాజ్ తరుణ్ కు బంగారం పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరో ప్రధాన ఆకర్షణ. బీజీఎమ్ గా 'అనుభవించు రాజా..' ట్రాక్ ని జోడించి ఉల్లాసవంతమైన హీరో పాత్రని ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ కెమెరా పనితనం కారణంగా గ్రామీణ వాతావరణం కలర్ ఫుల్ గా.. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా కనిపిస్తుంది.

మొత్తం మీద 'అనుభవించు రాజా' టీజర్ చాలా వినోదాత్మకంగా ఉంది. థియేటర్లలో ఈ సినిమా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని హింట్ ఇస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ కథానాయిక. గేయ రచయిత భాస్కరభట్ల పాటలు రాస్తుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సుప్రియా బట్టేపాటి - రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు. విజయ్ బిన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అనుభవించు రాజా' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.