Begin typing your search above and press return to search.

ఐ లవ్ మార్నింగ్ షూట్ అంటున్న చరణ్

By:  Tupaki Desk   |   13 Nov 2019 8:16 AM GMT
ఐ లవ్ మార్నింగ్ షూట్ అంటున్న చరణ్
X
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కథానాయకులైన ఎన్టీఆర్.. రామ్ చరణ్ లపై విడిగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

చరణ్ షూటింగ్ కు బయలుదేరి వెళ్తూ ఒక వీడియో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చరణ్ స్వయంగా డ్రైవ్ చేస్తూనే మాట్లాడారు. "రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కు రావడం సంతోషం.. మార్నింగ్ షూట్స్ నాకు చాలా ఇష్టం" అని చెప్పారు. చరణ్ పోస్ట్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ కొందరు మాత్రం డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ఫీ వీడియో షూట్ చేయడం సరికాదని.. జాగ్రత్తగా ఉండాలని చరణ్ కు సూచించారు.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ బ్రిటిష్ జడ్జిల ముందు తన వాదనలు వినిపిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది జులై 30 వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారని తెలిసిందే. దీంతో ఆ డెడ్లైన్ మిస్ కాకూడదనే ఆలోచనతో షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారని సమాచారం.