చెర్రీ ఎంతగా మారిపోయాడో కదూ.

Thu May 24 2018 15:49:31 GMT+0530 (IST)

Ram Charan Changes His Strategy Over Script Selection

రామ్ చరణ్ ఇప్పటివరకూ ఫార్ములా సినిమాలు చేయడమే కనిపించింది. ఒక్క ఆరెంజ్ మూవీ ఫెయిల్ అయిందని.. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూనే వచ్చాడు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని సినిమాలు 40 కోట్లకు పైగా షేర్ రాబట్టి సేఫ్ జోన్ లోకి చేరుకున్నా.. బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకోలేకపోయాయి.కానీ ధృవ దగ్గర నుంచి చెర్రీ ఆలోచనలో మార్పు వచ్చింది. రంగస్థలం అయితే.. మెగా పవర్ స్టార్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. కంటెంట్ పరంగా ప్రయోగం చేసి.. మెప్పిస్తే ఏ స్థాయి సక్సెస్ అందుకోవచ్చో చరణ్ కు రుచి చూపించిన సినిమా రంగస్థలం. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి.. అర్ధ శతదినోత్సం పూర్తి చేసుకున్నాక కూడా ఇంకా షేర్ పై రన్ అవుతోంది. 'బాక్సాఫీస్ దగ్గర ఓ రీజనల్ మూవీ ఇలాంటి నెంబర్స్ ను నమోదు చేయడం కచ్చితంగా ఉత్సాహం ఇచ్చే విషయమే. జనాలు థియేటర్లకు వచ్చి డబ్బులు వెచ్చింది.. సమయం వెచ్చించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని అర్ధం అవుతుంది' అన్నాడు రామ్ చరణ్.

కొత్త అంశాలను టచ్ చేయడం ద్వారా.. కొత్త కథలను అన్వేషించవచ్చని అంటున్న మెగా పవర్ స్టార్.. కొత్త స్టోరీలను ట్రై చేస్తూనే ఉంటానని.. బాక్సాఫీస్ సక్సెస్ కు అవే బాటలు వేస్తాయని అంటున్నాడు. ఒకప్పుడు కమర్షియల్ కథలనే నమ్ముకున్న చెర్రీ.. ఇప్పుడు కొత్త రకం కథలనే చేస్తానంటున్నాడంటే.. ఎంతగా మారిపోయాడో కదూ.