Begin typing your search above and press return to search.

ఉమామహేశ్వర సూపర్‌ అన్న చరణ్‌

By:  Tupaki Desk   |   11 Aug 2020 10:30 AM GMT
ఉమామహేశ్వర సూపర్‌ అన్న చరణ్‌
X
హీరోగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలన్‌ గా అన్ని జోనర్స్‌ ను టచ్‌ చేస్తూ సినిమాలు చేస్తున్న సత్యదేవ్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరాఫ్‌ కంచరపాలెం సినిమా మేకర్స్‌ ఈ సినిమాను రూపొందించారు. ఒక సింపుల్‌ స్టోరీని చాలా విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో ఆకట్టుకునే పాత్రతో దర్శకుడు వెంకటేష్‌ మహా రూపొందించాడు. థియేటర్‌ లో విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రంకు రామ్‌ చరణ్‌ నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఈమద్య కాలంలో వేరే సినిమాల గురించి ఎక్కువగా స్పందించని రామ్‌ చరణ్‌ ఉమామహేశ్వర సినిమా గురించి మాత్రం చాలా పాజిటివ్‌ వ్యాఖ్యలు చేశాడు. సినిమా గురించి జనాలు ఆలోచించే విధంగా చేశాడు. సినిమా చాలా బాగుంది. సినిమా కంటెంట్‌ నిజం చెప్పినట్లుగా చాలా బాగుంది.

సత్యదేవ్‌ తో పాటు ఇతర నటీనటులు అంతా కూడా బాగా చేశారు. సినిమా సక్సెస్‌ కు యూనిట్‌ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. చరణ్‌ తో పాటు ఇంకా కొందరు ప్రముఖులు కూడా ఇంతకు ముందే ఉమామహేశ్వ ఉగ్రరూపశ్య సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. చరణ్‌ ప్రశంసలతో సినిమాకు ఓటీటీలో మరింత వ్యూస్‌ దక్కే అవకాశం ఉందంటున్నారు.