మెగా పవర్ స్టార్ తో సుక్కు శిష్యుడి పాన్ ఇండియా మూవీ!

Mon Nov 28 2022 12:04:43 GMT+0530 (India Standard Time)

Ram Charan Announces His Next With Buchi Babu

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన మూవీ'ఉప్పెన'. ఫీల్ గుడ్ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రూ. 100 కోట్లు వసూళ్లని రాబట్టి ట్రేడ్ విర్గాలని వస్మయానికి గురిచేసింది. దీంతో తొలి ప్రయత్నంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడిగా బుచ్చి బాబు రికార్డు సాధించి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు.ఈ మూవీ తరువాత దర్శకుడు బుచ్చిబాబు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇదే అదనుగా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలనుకున్నాడు. ఉత్తరాంథ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలనుకున్నాడు. దీని'పెద్ది' అనే టైటిల్ కూడా ఫైనల్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ముందు బుచ్చిబాబు చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పారని.. అయితే ఆ తరువాత ఆ మార్పులు చేయడం మొదలు పెట్టాడని వార్తలు వినిపించాయి.

కానీ'RRR' రిలీజ్ కావడం.. పాన్ ఇండియా మూవీగా సంచలనాలు సృష్టించడం.. వరల్డ్ వైడ్ గా  ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం.. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడంతో బుచ్చిబాబు కథని పక్కన పెట్టాడని బుచ్చిబాబు తన ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించలేడనే అనుమానంతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజున కనీసం బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కష్టమనే సంకేతాలు వినిపించాయి.

వెవంటనే బుచ్చిబాబు తన గురువు సుకుమార్ ద్వారా రామ్ చరణ్ ని కలిసి స్టోరీ చెప్పడం.. తనకు బాగా నచ్చడంతో వెంటనే చరణ్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్దలు మొదలయ్యాయి. తాజాగా సోమవారం ఆ వార్తలని నిజం చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించింది. ఇదొక పాన్ ఇండియా మూవీ అని సుకుమార్ వ్రైటింగ్స్ అధికాక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించి చరణ్ తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేసింది.

ఇదే సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు.'కొన్ని సార్లు తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది. రామ్ చరణ్ సార్ తో నా తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటిస్తున్నందుకు అమితానందంగా వుంది. వెలకట్టలేని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చరణ్ సార్.

నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞుడనై వుంటాను' అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. రామ్ చరణ్ హీరోగా నటించినున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ వ్రైటింగ్స్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.