Begin typing your search above and press return to search.

చరణ్‌ - శంకర్ మూవీ కాన్సెప్ట్ ఇదేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2021 12:30 AM GMT
చరణ్‌ - శంకర్ మూవీ కాన్సెప్ట్ ఇదేనా?
X
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పై అంచనాలు కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. శంకర్ సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అంటూ ముందు నుండే ఒక అభిప్రాయం ఉంది. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జెంటిల్మాన్ నుండి మొన్నటి 2.ఓ సినిమా వరకు కూడా ప్రతి సినిమా లో కూడా ఒక సామాజిక విషయాన్ని చూపిస్తూ జనాల్లో అవగాహణ తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న శంకర్ ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నాడు అనేది అందరికి సస్పెన్స్ గా ఉంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కార్పోరేట్ సంస్థలు ఎలా భారతీయ చట్టాలను అడ్డు పెట్టుకుని కోట్లు దండుకుంటున్నాయి అనేది చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

చట్ట ప్రకారం సంపాదించేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా కోట్లు సంపాదించలేరు.. అక్రమ మార్గంలోనే సంపాదించాలని భావించే వారికి బుద్ది చెప్పే పాత్రలో రామ్‌ చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. రామ్‌ చరణ్ ను ఈ సినిమా లో శంకర్ కలెక్టర్ గా చూపిస్తాడని కొందరు భావిస్తున్నారు. అయితే మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ అయితే లేదు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా ను దిల్‌ రాజు నిర్మించబోతున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థలో 50వ సినిమా గా రూపొందుతుంది. అందుకే ఈ సినిమాను ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా దిల్‌ రాజు తీసుకుని నిర్మించడం జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగింది.

ఇటీవల జరిగిన సినిమా ప్రారంభోత్సవం మరియు ఫొటో షూట్‌ కే ఏకంగా కోటి రూపాయలను ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఖచ్చితంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన చేరి పాన్ ఇండియా స్టార్ గా మారడం ఖాయం. కనుక శంకర్ సినిమా కూడా చరణ్ కు మరింత క్రేజ్ ను తీసుకు వస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్ మరియు శంకర్ ల కాంబో మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఈ టైటిల్ అన్ని భాషలకు సూట్ అయ్యేలా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆలోచనలో పడ్డారని అంటున్నారు. 2023 లో ఈ సినిమాను విడుదల చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.