రామ్ బోయపాటి కాంబో రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Mon Mar 27 2023 21:56:57 GMT+0530 (India Standard Time)

Ram Boyapati combo movie release date confirmed

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అంటే ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. అలాగే చాలా చిత్రాలలో స్టైలిష్ లుక్ లోనే రామ్ కనిపించడం విశేషం. మాస్ క్యారెక్టర్ చేసిన సినిమాలు ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే మొదటిసారి అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ రోల్ లో రామ్ పోతినేని కనిపించబోతున్నాడు.ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మస్తున్నారు. తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళీ భాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో శ్రీలీల రామ్ కి జోడిగా నటిస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని ప్రేక్షకులు ముందుకి తీసుకొచ్చారు.

అక్టోబర్ 20న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లుగా పోస్టర్ లో కన్ఫర్మ్ చేశారు. ఇక బోయపాటి శ్రీను స్టైల్ లోనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ ఉండబోతుందని పోస్టర్ బట్టి అర్థమవుతుంది. పోస్టర్ లో కళ్ళజోడు పెట్టుకుని గడ్డంతో ఉన్న రామ్ దున్నపోతుని పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లడం కనిపిస్తోంది. బ్యాక్ డ్రాప్ లో ఒక ఫెస్టివల్ జరుగుతున్న అపీరియన్స్ ఉంది.

దీన్నిబట్టి మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ఉండబోతుంది అని తెలుస్తుంది. గత ఏడాది ది వారియర్ మూవీతో డిజాస్టర్ కొట్టిన రామ్ ఈ సినిమాతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దానికి తగ్గట్లుగా పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను గ్రాండ్ గా ఈ మూవీతో రామ్ పోతినేని ఏ మేరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.