Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ స‌ర్జ‌రీల‌పై గుస‌గుస‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 PM GMT
స్టార్ హీరోయిన్ స‌ర్జ‌రీల‌పై గుస‌గుస‌
X
సౌత్ స‌హా బాలీవుడ్ లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్. ఈ భామ‌ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. టాలీవుడ్..కోలీవుడ్.. బాలీవుడ్ అన్ని భాష‌ల్లోనూ బిజీగా ఉంది. క‌రోనా రాక‌తో పెండింగ్ ప‌డిన ప్రాజెక్ట్ ల‌న్ని ఒకేసారి సెట్స్ కు వెళ్ల‌డంతో ర‌కుల్ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా హైద‌రాబాద్.. చైన్నై.. ముంబైకి చ‌క్క‌ర్లు కొడుతోంది. నెల‌లో రెండు.. మూడు సార్లు ఈ ట్రిప్పులు త‌ప్ప‌డం లేదు. ప్ర‌యాణాల‌తోనే క్ష‌ణం తీరిక లేకుండా ర‌కుల్ గ‌డుపుతోంది. అయినా సోష‌ల్ మీడియాలో చలాకీత‌నం మాత్రం త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాలో త‌న కొత్త ఫోటోల్ని ని అప్ డేట్ చేస్తూ మైమ‌రిపిస్తోంది.

అయితే తాజాగా అప్ డేట్ చేసిన ఫోటోని చూస్తే ర‌కుల్ లో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖంలో చాలా మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌న‌ రెండు బుగ్గ‌లు కాస్త లోనికి లాగాయి.. బుల్లి బుల్లి పెదవులు ఇప్పుడు బాగా పెద్ద‌విగాను క‌నిపిస్తున్నాయి. మ‌రి వీటికి ఏవైనా స‌ర్జ‌రీలు చేయించారా? అంటూ నెటిజ‌నుల్లో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ స్నాప్ లో ర‌కుల్ ముఖ‌మంతా ఫుల్ మ్యాక‌ప్ తో క‌నిపిస్తోంది. ర‌కుల్ పూర్తిగా ఫ్రెష్ లుక్ లో ఉంది. అలాగే `లండ‌న్` అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జోడిచింది. దీన్ని బ‌ట్టి రకుల్ ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ ఫోటో పై నెటిజ‌నుల కామెంట్లు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. కొంత మంది అస‌లు ర‌కుల్ ఇలా ఉంటుందా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ర‌కుల్ ఫేస్ లో మార్పులు ఊహించ‌ని విధంగా.. గుర్తుప‌ట్ట‌లేనంత‌గా ఉన్నాయ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

ర‌కుల్ ఇప్ప‌టికే ముక్కు కి స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కెరీర్ ఆరంభంలో ర‌కుల్ ముక్కు కండ‌రం స‌ర్జ‌రీ త‌ర్వాత ముక్కు అందం పెరిగింది. ఇప్పుడు ముఖాకృతికి స‌ర్జ‌రీ అంటూ ప్ర‌చారం వేడెక్కిస్తోంది. అయితే దీనిని ర‌కుల్ ఖండిస్తుందేమో చూడాలి. ర‌కుల్ హీరోయి న్ గా న‌టించిన‌ కొండ‌పొలం అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నా అనివార్య కార‌ణాల వల్ల వాయిదా ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.