Begin typing your search above and press return to search.

‘థాంక్ గాడ్’ అంటున్న రకుల్..

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:30 AM GMT
‘థాంక్ గాడ్’ అంటున్న రకుల్..
X
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే సౌత్ లో స‌త్తా చాటిన ఈ భామ‌.. నార్త్ లో పాగావేయాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. గ‌తంలో ప‌లు సినిమాలు కూడా చేసింది. కానీ.. ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కురాలిగా మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో అజయ్ దేవ్ గన్ సరసన ‘మేడే’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తికాకుండానే.. ఇంద్ర కుమార్ దర్శక‌త్వంలో "థాంక్ గాడ్" పేరుతో మ‌రో సినిమా మొద‌లైంది. ఇందులో కూడా అజయ్ దేవగన్ తో క‌లిసి న‌టిస్తోందీ బ్యూటీ. వీరితోపాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు.

అయితే.. లేటెస్ట్ గా ఈ సెట్ లో అడుగుపెట్టింది ర‌కుల్‌. ఈ సండే ‘థాంక్ గాడ్’ టీంతో కలిసిపోయిన రకుల్.. తన మొదటి రోజు వర్క్ ఎలా ఉందో ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ మేర‌కు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘కొత్త చిత్రానికి ముందు హ్యాపీ ఫేస్’ అంటూ ఓ చిత్రాన్ని షేర్ చేసిన రకుల్.. ఆ తర్వాత మరో ఫొటోను పోస్ట్ చేసింది. మేకప్ వేసుకుంటూ షూట్ కోసం రెడీ అవుతున్న ఫొటోను షేర్ చేసింది రకుల్.

ఆ తర్వాత ఒక వీడియోను కూడా షేర్ చేసింది. #Morningmadness అనే హ్యాష్‌ట్యాగ్‌తో క్లిప్‌ను పోస్ట్ చేసింది రకుల్. ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలవనుంది. మరి, బాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తున్న రకుల్ ఆశలు ఈ సినిమాలతోనైనా నెరవేరుతాయా అన్నది చూడాలి.