'ఇంస్టాగ్రామ్' ఫాలోయింగులో టాప్ హీరోయిన్ రకుల్.. ఆ తర్వాత వీరే..!!

Wed Aug 05 2020 19:30:33 GMT+0530 (IST)

Top heroine Rakul in 'Instagram' following .. who are they after that .. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్లు ఎంతమంది ఉన్నారో.. వాళ్లందరికీ మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ ఎప్పుడెప్పుడు ఫోటో గాని.. వీడియో గాని పోస్ట్ చేస్తుందా..? ఎప్పుడెప్పుడు లైక్ కొడదామా.. అని వెయిట్ చేస్తుంటారు. మరి అంత పాపులారిటీ హీరోయిన్లకు ఎక్కడ నుండి వస్తుంది అంటే.. ఒకటి సినిమాలు రెండవది ఫోటోషూట్స్. ఈ రెండింటితో కోట్లాది సినీప్రియుల మనసులను దోచుకుంటున్నారు టాలీవుడ్ సీనియర్ అండ్ కుర్ర భామలు. అందులో కొందరు మొదటి నుండి గ్లామర్ షోతో ఆకట్టుకునే వారుండగా.. మరికొందరు ఎలాంటి గ్లామర్ షో చేయకుండానే సింపుల్ అండ్ నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంటున్నారు. కానీ మొత్తంగా చూస్తే గ్లామర్ డాల్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోయింగ్ మార్క్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ మాత్రమే టాప్ లో ఉంది. అలాగే ఈ సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెబుతూ ఓ స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేసింది.నిజానికి సినీ ఫీల్డ్ గురించి ఐడియా లేకుండానే రకుల్ సినిమా రంగంలోకి వచ్చేసిందట. కానీ ఆదరణ మాత్రం మొదటి నుండి అందించడంతో ఈ స్థానంలోకి చేరినట్లు రకుల్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం అమ్మడు ఇండియన్-2 అయలన్ సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. మరికొందరు టాలీవుడ్ హీరోయిన్స్ ఇంస్టాగ్రామ్ ఫాలోయింగ్ ఈ విధంగా కలిగి ఉన్నారు. రకుల్ తర్వాత గ్లామర్ బ్యూటీ కాజల్ 14.8 మిలియన్స్ తో సెకండ్ పోసిషన్ లో ఉంది. అలాగే శృతిహాసన్ 14.4 మిలియన్స్.. బుట్టబొమ్మ పూజాహెగ్డే 11.2 మిలియన్స్.. ఇలియానా 12.7 మిలియన్స్.. సమంత తమన్నాలు 11.1 మిలియన్ల ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇక యంగ్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్ 7.1 మిలియన్స్.. కీర్తిసురేష్ 5.8 మిలియన్.. రాశిఖన్నా 5.2 మిలియన్స్.. నివేత థామస్ 3.9.. హన్సిక 3.7.. స్టార్ హీరోయిన్ త్రిష 2.4 మిలియన్స్.. సాయిపల్లవి 2.2 మిలియన్స్.. ఇక నివేద పేతురాజ్ 2.1 మిలియన్ల ఫాలోయింగ్ కలిగి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.