Begin typing your search above and press return to search.

నిరాశలో రకుల్ ఫ్యాన్స్.. అందుకేనా??

By:  Tupaki Desk   |   22 Feb 2021 8:10 AM GMT
నిరాశలో రకుల్ ఫ్యాన్స్.. అందుకేనా??
X
టాలీవుడ్ హీరో నితిన్ కొత్త సినిమా ‘చెక్’. ప్రస్తుతం రిలీజ్ దగ్గరపడటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన చెక్ ప్రీరిలీజ్ కార్యక్రమానికి రకుల్ హాజరు కాలేదు. ముంబైలో షూటింగ్‌తో బిజీగా ఉందని ప్రేక్షకులకు ముందే చెప్పిందట. నిజానికి విడుదల కాబోయే సినిమాలకు చాలా ముఖ్యమైన రోజంటే అది ప్రీరిలీజ్ ప్రోగ్రాం ఆ తర్వాతే విడుదల రోజు. అలాంటి ఇంపార్టెంట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రకుల్ లేకపోవడం సోషల్ మీడియాలో చర్చలకు దారితీస్తోంది.

కానీ రకుల్ హాజరు కాకపోవడంతో ఆమె తెలుగు అభిమానులు సంతృప్తిగా లేరట. సోషల్ మీడియా పేజీల ద్వారా ఫ్యాన్స్ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చెక్ మూవీ ముఖ్యమైన రోజున ముంబై షూటింగ్ ఒకరోజు కాన్సల్ చేసుకొని రావచ్చు కదా అంటున్నారు. ఈ కార్యక్రమంలో రకుల్ లేకపోవడం అనేది సినిమాను, దర్శకుడుని, ప్రొడ్యూసర్, హీరోలను అగౌరవపరిచినట్లే అంటూ సీరియస్ పుకార్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందే కొంతమంది హీరోయిన్లు చేసినట్లు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చిన తర్వాత టాలీవుడ్‌ను మరచిపోవద్దని రకుల్ కు గుర్తుచేశారు. చెక్ ఈవెంట్ కు రకుల్ రాలేదు కానీ డెబ్యూ హీరోయిన్ ప్రియా ప్రకాష్ రావడం రకుల్ ఫ్యాన్స్ లో నిరాశ చెందారని టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించగా.. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.