Begin typing your search above and press return to search.

ఐఫా వేదికపై రకుల్ అందాల విస్పోటనం..!

By:  Tupaki Desk   |   29 May 2023 10:52 AM GMT
ఐఫా వేదికపై రకుల్ అందాల విస్పోటనం..!
X
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. తాజాగా ఐఫా అవార్డ్స్ వేదికపై కూడా ట్రెండీ లుక్ తో అదరగొట్టింది. ఐఫా ఈవెంట్ లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం.

బ్లాక్ కలర్ డ్రెస్ లో చందమామలా మెరిసిపోయింది. స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న గౌనులో అందాలను ప్రదర్శన అదరగొట్టేసింది. ముందుర అందాలను ఆరబోసింది. ఇక ఆమె థైస్ షోకి కుర్రాళ్లకు చెమటలు పెట్టేలా ఉన్నాయి.

ఈ అందాల విస్పోటనం తట్టుకోవడం మావళ్ల కాదు బాబోయే అనిపించేలా ఉన్నాయి ఈ ఫోజులు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక, రకుల్ టాలీవుడ్ లో తన కెరీర్ ని ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్ కి షిప్ట్ చేసింది.కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టింది.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకుంటోంది. గతేడాది రకుల్ నటించిన బాలీవుడ్ సినిమాలు దాదాపు ఐదు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఒక్కటి హిట్టైనా అక్కడ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగేది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

దీంతో, ప్రస్తుతం బాలీవుడ్ లోనూ ఛాన్సుల విషయంలో కొంచెం బ్రేక్ పడింది. దీంతో, ఆమె మళ్లీ సౌత్ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ తమిళ సినిమాలో అవకాశం లభించినట్లు తెలుస్తోంది. దీంతో, మళ్లీ ఈ సినిమాతో దక్షిణాది జనాలకు రకుల్ దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి దక్షిణాదిన రకుల్ కమ్ బ్యాక్ ఎలా ఉంటుందో.