ఫోటో టాక్: పైన పటారం లోన లొటారం

Sat Sep 21 2019 15:14:39 GMT+0530 (IST)

Rakul Preet singh Glamourous Pose

పైన పటారం లోన లొటారం! అంటే ఇదేనేమో.. అందాల ఆరబోతకు కొత్త డెఫినిషన్ ఇస్తోంది ఈ బ్యూటీ. అయినా ఇలా పైన బటన్ విప్పేస్తే కళ్లప్పగిస్తారా? ఇన్ స్టాగ్రమ్ లు షట్ డౌన్ చేసేయరూ? ఏమాత్రం భేషజం లేని కుర్రకారును తక్కువగా అంచనా  వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. పంజాబీ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పీడ్ గురించి చెప్పాల్సి పనేలేదు. ఓవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపారాలు.. ఇంకోవైపు ఫోటోషూట్లు ఇదో నిరంతర ప్రక్రియ.తాజాగా బ్లూ డెనిమ్స్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు కుర్రకారు కంటికి కునుకు పట్టనీయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అసలే డెనిమ్స్ లో రగ్గ్ డ్ గా మాసీగా కనిపిస్తున్నా.. టాప్ లో బటన్ ఓపెన్ చేసి  విజువల్ ఫెస్ట్ కి ఓపెన్ లెటర్ రాసింది. అసలు రకుల్ ఆఫర్ ఏంటో అర్థంగాక కన్ఫ్యూజన్ లో పడిపోతోంది యూత్.

``నీ నమ్మకం నీలోని రియాలిటీకి జన్మనిస్తుంది`` అంటూ అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది ఈ ఫోటోకి. నిజమే.. రకుల్ లోని రియాలిటీ ఏంటో తెలిసొస్తోంది ఇప్పుడిప్పుడే. ఇటీవలే 60 ఏజ్ మన్మధుడితో అదరిపోయే రొమాన్స్ చేసింది. అలాగని కుర్రహీరోలతో ఆఫర్ ని కాదనలేకపోతోంది. మరోవైపు ముంబై పరిశ్రమలో అదిరిపోయే క్రేజీ ఛాన్సెస్ ఖాతాలో వేసుకుంటోంది. ఇలా దూకుడు తగ్గిందే అనుకుంటుండగానే తెలివైన ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. ఫిట్నెస్ బిజినెస్.. స్పోర్ట్స్ టీమ్ లపై పెట్టుబడులు.. మరోవైపు కథానాయికగా అవకాశాలు.. ఇలాంటి తెలివైన  ప్లానింగ్ వేరే ఎవరైనా చేయగలరా?