ఓబులమ్మతో మరికొన్నాళ్లు కంటిన్యూ అయ్యేనా?

Fri Sep 24 2021 11:02:26 GMT+0530 (IST)

Rakul Preet said that the character has room for acting

టాలీవుడ్ లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు డేట్లు ఇవ్వలేక పోయింది. యంగ్ స్టార్స్ అందరితో నటించిన అరుదైన ఘనత ను దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నా కూడా ఆమె పెద్ద సినిమాలు మాత్రం దక్కించుకోలేక పోయింది. హీరోయిన్ గా బిజీగా ఉన్నా కూడా మళ్లీ ఆ టైమ్ కోసం రకుల్ ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'కొండపొలం' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాలున్న కొండ పొలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా కరోనా ఇతర కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. కొండ పొలంలో రకుల్ పాత్ర పేరు ఓబులమ్మ. చాలా విభిన్నంగా ఉంటుందని.. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అంటూ చెబుతోంది.క్రిష్ దర్శకత్వంలో రూపొందడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను వైష్ణవ్ తేజ్ తో క్రిష్ ముగించాడు. కేవలం రెండు నెలల లోపు గ్యాప్ లోనే ఈ సినిమాను చేసిన దర్శకుడు క్రిష్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో స్టార్స్ దృష్టిని ఆకర్షించలేక పోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఖచ్చితంగా ఓబులమ్మగా కనిపించి మెప్పించి ఆకట్టుకుంటుందట. ఓబులమ్మ లుక్ ను ఇప్పటికే రివీల్ చేసిన మేకర్స్ ముందు ముందు సినిమా ప్రమోషన్ కు సిద్దం అవుతున్నారు. దసరా ముందు రాబోతున్న కొండ పొలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బిజీ అవుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

కొండపొలం లో వైష్ణవ్ తేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఓబులమ్మ పాత్ర ఉంటుందని.. సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా సహజంగా ఒక హీరో హీరోయిన్ అన్నట్లుగా కాకుండా మన మద్యలో ఉన్నారా అన్నట్లుగా అనిపించేలా క్రిష్ తెరకెక్కించాడట. కొండపొలం అనే ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. క్రిష్ బిగ్గెస్ట్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. అయినా కూడా కొండ పొలం నవలపై ఆయనకు ఉన్న మక్కువతో చేయడం జరిగింది. ఓబులమ్మ సినిమా చిత్రీకరణ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా తర్వాత మరికొన్నాళ్ల పాటు కెరీర్ లో బిజీ అవ్వడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు అనేవారట. తెలుగు తో పాటు కోలీవుడ్ హిందీలో కూడా సినిమాలు చేస్తున్నా కూడా ఆమెకు మాత్రం తెలుగు నుండి ఆఫర్ల కోసమే ఆరాటం ఉండేదట. అందుకే కొండ పొలం ఆమె కోరికను తీర్చి మరికొంత కాలం టాలీవుడ్ లో కంటిన్యూ అయ్యేలా చేస్తుందా అనేది చూడాలి.