ఎన్టీఆర్: ఆమే శ్రీదేవి అంటున్న ప్రొడ్యూసర్

Thu Aug 09 2018 13:35:58 GMT+0530 (IST)


నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను టేకప్ చేస్తానని చెప్పినప్పుడు అది సాధ్యమా అన్నట్టుగా కొందరు పెదవి విరిచారు. భిన్న పార్శ్వాలు బయట తెలిసిందే కాకుండా తెలియని కోణాలు కూడా ఉన్న తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని తెరమీదకు తీసుకురావడం అనే ప్రయత్నం కత్తి మీద సాము లాంటిదని అన్నారు.  సినిమా రిలీజ్ కాకుండా మనం సినిమా ఎలా ఉంటుందో అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో.ఇదంతా పక్కనబెడితే సినిమా పై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.  క్రిష్ సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన నాటినుండీ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.  ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి.  రీసెంట్ గా రకుల్ కాదు.. శ్రద్ధ కపూర్ ను తీసుకుంటున్నారని కూడా అన్నారు.  తాజాగా 'ఎన్టీఆర్' నిర్మాతలలో ఒకరు బాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ శ్రీదేవి పాత్రను రకుల్ పోషిస్తుందని తెలిపాడు. అంతే కాదు రకుల్ కు అడ్వాన్సు కూడా ఇచ్చామని చెప్పాడు.  శ్రీదేవి పాత్రను పోషించే అవకాశం వదులుకోవడం ఇష్టం లేక తన కాల్ షీట్స్ ను కూడా అడ్జస్ట్ చేసుకుందని తెలిపాడు.

త్వరలో ఎన్టీఆర్ టీమ్ తో రకుల్ జాయిన్ అవుతుందట.  సో.. బాలయ్య - రకుల్ 'ఆకు చాటు పిందె తడిసే ఆహుం ఆహుం.. ' పాటేసుకుంటారు.  డ్రీమేసుకుంటేనే ఇలా ఉంటే ఇక సిల్వర్ స్క్రీన్ మీద దబిడి దిబిడే...!