Begin typing your search above and press return to search.

'బ్రో' ని ఇలా డిస్ట‌ర్బ్ చేస్తే ఎలా అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
బ్రో ని ఇలా డిస్ట‌ర్బ్ చేస్తే ఎలా అమ్మ‌డు?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయితేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో `బ్రో` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ క్లామాక్స్ కి వ‌చ్చేసింది. ప‌వ‌న్ పై చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రెండు పాట‌లు ప్ర‌ధానంగా పెండింగ్ ఉన్నాయి. అందులో ఒక‌టి ఐట‌మ్ సాంగ్ ఉంది. అందుకే టీమ్ స్టార్ హీరోయిన్ల‌నే ప‌రిశీలిచింది. ప‌వ‌న్-సాయితేజ్ ల‌తో క‌ల‌సి తెర‌ను పంచుకోవాల్సిన పాట కావ‌డంతో! వాళ్ల రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌ని హీరోయిన్ కోసం వెతికి వెతికి చివ‌రికి ర‌కుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసారు.

ఒకేసారి తో ఇద్ద‌రితో డాన్సు చేసే అవ‌కాశం రావ‌డంతో అమ్మ‌డు ఎగిరి గంతేసి సైన్ చేసింది. చాలా కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్నా `బ్రో`లో అవ‌కాశం రావ‌డంతో మిస్ చేసుకోవ‌డానికి రెడీగా లేదు. సోమ‌వారం నుంచి ఈ పాట చిత్రీక‌ర‌ణ ఉందిట‌. అయితే ఇంత‌లో బ్రోకి ర‌కుల్ ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్లు గుసుగుస వినిపిస్తుంది. డేట్లు అడ్జస్ట్ కావ‌డం లేద‌ని....కుదిరితే కొత్త డేట్లో ప్లాన్ చేసుకోండ‌ని అమ్మ‌డి సంకేతాలు పంపిందిట‌.

దీంతో యూనిట్ ర‌కుల్ ని ప‌క్కాగా ఓ డేట్ చెప్ప‌మ‌ని మేక‌ర్స్ అడుగు తున్నారుట‌. ఆ ర‌కంగానూ అమ్మ‌డు ప‌క్కాగా తేదీలు చెప్ప‌లేక‌త‌పోతుందిట‌. దీంతో యూనిట్ డైల‌మాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అమెని ఉంచాలా? తీసేసి కొత్త భామ‌ని తీసుకోవాలా? అన్న ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తుంది. ర‌కుల్ అయితే బాగుంటుంద‌ని టీమ్ భావిస్తున్నా! స‌మ‌యం కుద‌ర‌క‌పోవ‌డంతో స‌న్నివేశం మ‌రోలా ట‌ర్న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.

ఇది చిత్ర‌యూనిట్కి కాస్త ఇబ్బందైనా త‌ప్ప‌దు. మ‌రి అంత‌మింగా బ్రోలో ర‌కుల్ ఉంటుందా? ఉండ‌దా? అన్ని కొన్ని గంట‌ల్లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అమ్మ‌డు నోచెప్పాని ప్ర‌త్యామ్నాయంగా హాట్ బ్యూటీ ఊర్వ‌శి రేతేలా ఉండ‌నే ఉంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌`లో మాస్ నెంబ‌ర్ లో ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. ఊర్వ‌శి ఎంట్రీతో పార్టీ సాంగ్ ప్ర‌త్యేకంగానూ హైలైట్ అయింది. బ్రో టీమ్ అనుకున్న వాళ్లు కుద‌ర‌క‌పోతే గ‌నుక ఊర్విశి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.