తిట్టేవాళ్లకు రకుల్ అలా క్లాస్ తీస్కుంది!

Mon Jul 15 2019 21:09:19 GMT+0530 (IST)

సామాజిక మాధ్యమాల వెల్లువలో ఒకదాని వెంట ఒకటిగా వివాదాలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే `కబీర్ సింగ్` ఎపిసోడ్ లో సందీప్ రెడ్డి వంగా కు సమంత-  చిన్మయి బృందానికి మధ్య గొడవ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలోకి రకుల్ పేరును డ్రాగ్ చేశారు నెటిజనం. `మన్మధుడు 2`లో రకుల్ పొగ తాగుతూ వేసే వేషాలను సీరియస్ గా తప్పు బట్టిన సామాజిక జనం ఆల్మోస్ట్ రకుల్ ని తిట్టేసినంత పని చేశారు. ఇదివరకూ సమంత- చిన్మయి `డబుల్ స్టాండార్డ్స్` పాటించారంటూ తిట్టేసిన నెటిజనం ఇప్పుడు రకుల్ ని కూడా అదే పదజాలంతో ఆడుకున్నారు.డబుల్ స్టాండార్డ్స్ ని అనుసరిస్తున్న చిన్మయి.. తన భర్త రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన `మన్మధుడు 2` గురించి మాట్లాడడం లేదేమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. కబీర్ సింగ్ లో బోల్డ్ సీన్లు నచ్చని చిన్మయ.. తన భర్త గారు.. రకుల్ తో సిగరెట్ తాగే సీన్ తీస్తే మాత్రం అంగీకరిస్తుందని తిట్టేసే ప్రయత్నం చేశారు. దీనిపై ఓ చానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు రకుల్ అంతే ఆసక్తికర సమాధానం చెప్పింది.

ట్రోల్స్ గురించి నేను అస్సలు పట్టించుకోను. మేం తెరపై పాత్రధారులం మాత్రమే. అక్కడ మా పాత్ర ప్రవర్తన మాత్రమే చూపిస్తాం. రియాలిటీ వేరు. నటన వేరు! అంటూ లెక్చరిచ్చింది రకుల్. ఇది షాహిద్ కి అయినా లేదా ఇతర నటులకు అయినా వర్తిస్తుందని .. `మన్మధుడు 2`లో తన పాత్ర డిమాండ్ మేరకే పొగ తాగానని రకుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మన్మధుడు 2లో అవంతిక పాత్ర పొగ తాగాలి. పూర్తి సినిమా చూశాక అవంతిక అలా ఎందుకు చేసిందో అర్థమవుతుంది. కన్విన్సింగ్ గా ఉంటుందంటూ కవర్ చేసేందుకు ట్రై చేసింది. ఇలా ఖాళీగా కూచుని తిట్టే పనిలో ఉండకుండా ఇంతకంటే మంచి పనులు చేసేందుకు ప్రయత్నించండి అని క్లాస్ తీస్కుంది. మొత్తానికి మోడ్రన్ అమ్మాయిగా చెలరేగిపోయే పాత్రలో నటిస్తున్న రకుల్ జనాలకు క్లాస్ తీస్కోవడంలోనూ అంతే తెలివిగా వ్యవహరిస్తోంది కదూ?