రకుల్ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాకు సూపర్ రెస్పాన్స్

Sun Jan 29 2023 19:20:44 GMT+0530 (India Standard Time)

Rakul Preet Singh Chhatriwali

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ సినిమాలో నటించేందుకు ఆమెకు సమయం ఖాళీ లేదు. డేట్లు ఖాళీ లేవు అంటూ మహేష్ బాబు సినిమా ను వదులుకున్న బిజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.



అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు హిందీలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె నటించిన ఛత్రివాలి సినిమా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ జీ5 లో రకుల్ ప్రీత్ సింగ్ ఛత్రివాలి సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెక్స్ ఎడ్యుకేషన్ మరియు కండోమ్స్ వాడకం గురించి ఈ సినిమా లో చూపించారు.

జీ5 లో ఈ సినిమా నెం.1 లో ట్రెండ్ అవుతోంది. ఛత్రివాలిలో సుమీత్ వ్యాస్.. సతీష్ కౌశిక్.. డాలీ మరియు రాజేస్ తైలాంగ్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.