రకుల్ హాట్ వర్క్ అవుట్

Wed Mar 29 2023 20:22:39 GMT+0530 (India Standard Time)

Rakul Preet Shared Fitness Challenge

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోలు అందరికి ఇంచు మించు జోడీగా నటించింది. ఇక కమర్షియల్ చిత్రాలలో చేసిన పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.జయజానకినాయక నాన్నకు ప్రేమతో కొండపొలం ధృవ్ సినిమాలలో ఆమె పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇదిలా ఉంటే కొండపోలం సినిమా తర్వాత తెలుగు సినిమాలకి ఈ బ్యూటీ దూరం అయ్యింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ బిజీగా ఉంది. అక్కడ గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక ఈ ఏడాది కూడా మరో ఐదు ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి.అందులో మూడు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా ఆమె ఫిట్ నెస్ పైన ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.

అలాగే ఫుడ్స్ విషయంలో పెర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతుంది. అలాగే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫిట్ నెస్ కి సంబందించిన సూత్రాలు కూడా అందరికి చెబుతూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు ఫిట్ నెస్ చాలెంజ్ లో భాగంగా ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ఫిట్ నెస్ చాలెంజ్ యాక్సప్ట్ చేస్తున్నట్లు మెసేజ్ పెట్టి వర్క్ అవుట్ చేస్తుంది.

గ్యాప్ లేకుండా అన్ని రకాల వర్క్ అవుట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత హాట్ గా వర్క్ అవుట్ చేస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోతారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోని 2.94 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.