టాలీవుడ్ లో ఇక దశలో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 2015 నుంచి 2017 వరకు టాలీవుడ్ లో క్రేజీ స్టార్ లతో కలిసి నటించి ఆశ్చర్యపరిచిన రకుల్ ఆ తరువాత నుంచి ఆ ఫామ్ ని కోల్పోయింది. మహేష్ తో చేసిన 'స్పైడర్' తో భారీ డిజాస్టర్ ని దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా తన ఫామ్ ని కోల్పోయింది. ఆ క్షణం నుంచి స్టార్స్ సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకోలేక కెరీర్ విషయంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.
'ఖాకీ'('ధీరన్ అధిగారం')తో సక్సెస్ ని దక్కించుకున్నా కానీ ఆ స్తాయిలో మళ్లీ తెలుగు తమిళ భాషల్లో అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. 'ఐయారీ'తో బాలీవుడ్ బాట పట్టిన రకుల్ అక్కడ కూడా స్ట్రగుల్ పడుతూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. అజయ్ దేవ్ గన్ నటించిన 'దే దే ప్యార్ దే' బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుందే కానీ రకుల్ కు అవకాశాల్ని మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ప్రస్తుతం రకుల్ చూపంతా దక్షిణాదిపైనే వుంది.
హిందీ సినిమాలలో నటిస్తున్నా కానీ దక్షిణాదిలో ఎలాగైనా మళ్లీ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేసప్తోంది. రకుల్ ప్రస్తుతం తమిళంలో కమల్ హాసన్ - శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 శివ కార్తికేయన్ 'అయాలన్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రత్యేక కథలతో తెరకెక్కుతుండటంతో రకుల్ ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే పెట్టుకుందట. కమల్ తో చేస్తున్న 'ఇండియన్ 2' చిత్రీకరణ దశలో వుంది.
శివ కార్తికేయన్ తో చేస్తున్న 'అయాలన్' పరిస్థితి కూడా ఇంతే. ఈ సందర్భంగా రకుల్ ఓ మీడియాతో ముచ్చటిస్తూ కమల్ హాసన్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇండియన్ 2 మూవీలో నటించడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని తెలిపింది.
అంతే కాకుండా కమల్ హాసన్ ఓ విశ్వవిద్యాలం అంటూ ప్రశంసలు కురిపించింది. కమల్ తో కలిసి నటించడం తన అదృష్టం అని తెలిపింది. వందేళ్ల సినిమాలో 60 ఏళ్లుగా ఆయన వున్నారని చెప్పుకొచ్చింది.
కమల్ విషయంలో ఇది పెద్ద రికార్డు అని అభిప్రాయపడింది. ఇక అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసిన నటుడు కమల్ అని మనం చేసే పనిలో శ్రద్దతో పాటు పనిని నిబద్ధతతో చేస్తే మనమూ విజయాలు సాధించగలమని కమల్ హాసన్ తెలియజేశారని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తను చేస్తున్న ఇండియన్ 2 అయాలన్ సినిమాల్లో తన పోర్షన్ టాకీ పార్ట్ పూర్తయిందని త్వరలో పాటల చిత్రీకరణ మొదలవుతుందని తెలిపింది రకుల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.