#గుసగుస.. స్టార్ హీరోయిన్ ని సంతృప్తిపరచలేకపోయారా?

Sun Jan 16 2022 18:01:19 GMT+0530 (IST)

Rakul Preet About Tollywood Industry

ముంబై బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు టాలీవుడ్ హీరోలందరి సరసనా నటించేసింది. కానీ ఇంకా ఏదో అసంతృప్తి..! ఏమిటా డిసప్పాయింట్ మెంట్?మహేష్..ఎన్టీఆర్..బన్నీ..రామ్ చరణ్ ఇలా అగ్ర హీరోలందరి సరసన నటించేసిన రకుల్ కూల్ గా లేదు ఎందుకనో. దశాబ్ధ కాలంలోనే నటిగానూ మంచి ఐడెంటిటీ సంపాదించింది. పరిశ్రమలో అగ్ర హీరోలు దర్శక...నిర్మాతలతో మంచి పరిచయాలున్నాయి. నటిగా అవకాశాలు కల్పించడంలో పరిశ్రమ ఎంతగానో ప్రోత్సహించింది. అయితే పాన్ ఇండియా అవకాశాల విషయంలో మాత్రం అసంతృప్తిగానే ఉందని బ్యూటీ మాటల్లో తేలిపోయింది. తెలుగు సినిమాలను మించి హిందీ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తితో ఉంటోంది ఇటీవల.

``నేను తెలుగు..తమిళం..నా సొంత భాష హిందీ మాట్లాడగలను. కాబట్టి తెలుగు దర్శకులు రాబోయే పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తారని.. మెయిన్ లీడ్ గా పరగణించాల``ని తాజాగా కోరింది. ఆ రకంగా రకుల్ మనసులో మాటని బయట పెట్టేసింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలే చేస్తోంది. తెలుగులో కమిట్  మెంట్లు లేవు. దీన్ని బట్టి రకుల్ పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోవాలన్న ప్లాన్ లో భాగంగానే హిందీలో క్రేజ్ సంపాదించాలని అక్కడి సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  

టాలీవుడ్ డైరెక్టర్లు నేరుగా పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు కల్పించలేదనే అసంతృప్తితో హిందీలో ప్రూవ్ చేసుకుని..పాన్ ఇడియా అవకాశాల్ని తన చెంతకు రప్పించుకోవాలన్నది బ్యూటీ ప్రనాళికగా కనిపిస్తోంది. అయితే రకుల్ ముందుగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసింది తెలుగు పరిశ్రమనే. బాలీవుడ్ లో సినిమా చేసి ..అక్కడ అవకాశాలు రాకపోవడంతో  టాలీవుడ్ వైపు మళ్లింది. అనూహ్యంగా ఇక్కడ పెద్ద హీరోయిన్ అయింది. కానీ ఆ ఛరిష్మాని కొనసాగించలేకపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఇండియన్ -2లో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా అయినా వివాదాల వల్ల డిలే అవుతోంది. ఇది కూడా రకుల్ అసంతృప్తికి కారణం అయ్యుండొచ్చు.