రకుల్.. ప్రాక్టీస్ లో ఎంత సెక్సీగా ఉందో..

Wed Aug 10 2022 15:00:01 GMT+0530 (IST)

Rakul How Sexy In Practice

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కాలంలో ఆమె బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద అవి ఫలితాన్ని అందుకోలేకపోయాయి.అయితే ఆ ప్రభావం తనపై పడకుండా ఉండాలని అనుకుందో ఏమో గానే మొదటిసారి అమ్మడు ఒక ప్రైవేటు వీడియో సాంగ్ క్రియేట్ చేయడం విశేషం. అందులో గ్లామరస్ లుక్స్ తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

చాలామంది హీరోయిన్స్ ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక విధంగా క్రేజ్ పెరగడంతో పాటు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి కూడా అలాంటి ప్రైవేట్ సాంగ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా తెలివిగా ఆలోచించి కొత్త మ్యూజిక్ వీడియో మషూకాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

ఈ పెప్పీ టైటిల్ ట్రాక్‌ను ఆదిత్య అయ్యంగార్ దేవాన్ష్ శర్మతో కలిసి రాతన్ లాంబియాన్ సింగర్ అసీస్ కౌర్ పాడారు. రకుల్ మ్యూజిక్ వీడియోలో మల్టిపుల్ లుక్స్ ట్రై చేసి బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ పాట కోసం ఆమె ప్రత్యేకంగా ముందుగానే ప్రాక్టీస్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. వీడియో సాంగ్ కోసం అమ్మడు కొన్ని రోజుల పాటు డాన్స్ క్లాస్సెస్ లో తన డ్యాన్సర్స్ తల్ కలిసి ప్రాక్టీస్ చేసిందట అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఆ వీడియోలో రకుల్ ఎంత సెక్సీగా ఉందొ ఉంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో మరో మూడు సినిమాలు చేయాల్సి ఉంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. ఇక మధ్యలో ఆగిపోయిన కమలహాసన్ ఇండియన్ 2 సినిమా కూడా మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో కూడా ఒక యువ హీరోతో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.