భర్తని జైల్లో పెట్టించిన రాఖీ సావంత్… ఇది మ్యాటర్!

Tue Feb 07 2023 19:08:46 GMT+0530 (India Standard Time)

Rakhi Sawant Gets Her Husband Adil Khan Durrani Arrested

బాలీవుడ్ లో రాఖీసావంత్ గురించి తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు రాఖీసావంత్. ఈమె సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపుకంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో ఒకానొక సమయంలో ఐటెం క్వీన్ గా రాఖీ సావంత్ హవా నడిచింది. ఇక ఆమె రెగ్యులర్ గా రకరకాల పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే గతంలో స్వయంవరం పెట్టుకొని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న రాఖీ సావంత్ తరువాత కొంతకాలానికి అతనికి విడాకులు ఇచ్చింది.బాలీవుడ్ వివాదాస్పదమైన నటిగా ఆమె పేరు పాపులర్ అయ్యింది. ఆమె ఏం చేసిన అందులో నిజం ఉండదని అందరూ నమ్ముతూ ఉంటారు. అన్ని కూడా ఫేక్ డ్రామాలు ఆడుతూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక కొంతకాలం తర్వాత రాఖీసావంత్ భాగోతం బయటపడుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన భర్తని అరెస్ట్ చేయించాను. నన్ను నమ్మండి ప్లీజ్ అంటూ ఒక మెసేజ్ పెట్టింది. రాఖీసావంత్ భర్త అదీల్ దురానీని పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. నిజానికి ఈమె చెప్పినపుడు ఎవరూ నమ్మలేదు. అయితే పోలీసులు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించడంతో కన్ఫర్మ్ చేసుకున్నారు.

అయితే తన భర్తని రాఖీసావంత్ పోలీసులకి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో రాఖీసావంత్ తల్లి మరణించింది. అయితే తన తల్లి మరణానికి తన భర్త కారణం అని రాఖీ సావంత్ ఆరోపణలు చేసింది. అతనికి చూసుమని అప్పగించి బిగ్ బాస్ మరాఠీలో పాల్గొనడానికి వెళ్తే కనీసం పట్టించుకోకుండా వదిలేసాడని ఆమె పేర్కొంది. నా డబ్బులు అన్ని కూడా ఇష్టారీతిలో వాడుకున్నాడు అని తనని హింసించి తన డబ్బులు లాక్కున్నాడు అని ఆమె పేర్కొంది. ఇక తనని చావగొట్టెవాడని ఇలా కొడితే మీడియా ముందుకి వెళ్తానని చెబితే నా మాటలు ఎవరూ నమ్మరు అని బెదిరించేవాడని రాఖీసావంత్ చెప్పింది.

 అతనికి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉండటంతో ఇక ధైర్యం చేసి గృహసింహ కేసు పెట్టడం జరిగిందని ఆమె విడుదల చేసిన వాయిస్ నోట్ లో పేర్కొంది. తాను మా ఇంటికి వచ్చాడని ఈ సందర్భంగా అతన్ని పోలీసులకి అప్పగించి అరెస్ట్ చేయించినట్లు రాఖీసావంత్ పేర్కొంది. ఇక నెల రోజుల క్రితమే రాఖీసావంత్ తనకి పెళ్ళైన విషయాన్ని నిర్ధారించింది. తన భర్త ఆదిల్ దురానీ అని పేర్కొంది. తనని ఫ్యాన్స్ ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు అని అతను మీడియాకి దూరంగా ఉండాలనుకునే వ్యక్తి అని పేర్కొంది. ఇక అతను కూడా రాఖీసావంత్ ని పెళ్లి చేసుకున్న విషయాన్ని దృవీకరించాడు. ఇంతలో సడెన్ గా భర్తని కటకటాల్లోకి రాఖీసావంత్ పంపించి అందరికి షాక్ ఇచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.