ఇన్నాళ్లు వెయిట్ చేసి మళ్లీ ఫ్లాప్ డైరెక్టర్ తోనేనా?

Fri Dec 06 2019 23:00:01 GMT+0530 (IST)

Rakesh Shashi Movie With Allu Sirish

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కమర్షియల్ బ్రేక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అన్న అల్లు అర్జున్ మాదిరిగా స్టార్ హీరో అయ్యేందుకు అల్లు శిరీష్ చాలానే కష్టపడుతున్నాడు. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అల్లు హీరోకు సక్సెస్ లు పడటం లేదు. ఈ ఏడాది మే లో 'ఏబీసీడీ' చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అల్లు శిరీష్ అప్పటి నుండి మరే సినిమాను ఫైనల్ చేయలేదు. పలువురు దర్శకులు అల్లు శిరీష్ కు కథలు వినిపించారని వార్తలు వచ్చాయి.అల్లు శిరీష్ తదుపరి చిత్రం ఆ దర్శకుడితో.. ఈ దర్శకుడితో అంటూ వార్తలు వచ్చాయి. కాని అఫిషియల్ గా అయితే ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' దర్శకుడు రాకేష్ శశితో అల్లు శిరీష్ తదుపరి చిత్రం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవలే శిరీష్ ను కలిసిన రాకేష్ శశి ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాడట. అది శిరీష్ కు నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో రాకేష్ శశి ఉన్నాడట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత మెగా కాంపౌండ్ మరోసారి స్క్రిప్ట్ ను పరిశీలించిన తర్వాత అప్పుడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఇన్నాళ్లు వెయిట్ చేసిన అల్లు శిరీష్ మళ్లీ ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడం పట్ల కొందరు మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారు ఎంతో మంది ట్యాలెంట్ దర్శకులు ఉన్నారు. మరి శిరీష్ మళ్లీ రాకేష్ శశికే ఎందుకు ఛాన్స్ ఇస్తున్నట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు.