Begin typing your search above and press return to search.

ద‌స‌రా ధ‌మాకా..`పెద్ద‌న్న` త‌డాకా!

By:  Tupaki Desk   |   15 Oct 2021 7:30 AM GMT
ద‌స‌రా ధ‌మాకా..`పెద్ద‌న్న` త‌డాకా!
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో `అన్నాథే` అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసింబే. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు ర‌జనీలో మాస్ యాంగిల్ ని ఓరేంజ్ లో ఎలివేట్ చేసాయి. ఇక ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన ట్రైల‌ర్ యూ ట్యూబ్ లో రియార్డులు తిర‌గ‌రాస్తోంది. ర‌జ‌నీ మాస్ అప్పియ‌రెన్స్ మ‌రోసారి పీక్స్ లో క‌నిపిస్తోంది. లుంగీ క‌ట్టిన లుక్ లో సూప‌ర్ స్టార్ ని చూసి చాలా కాల‌మ‌వ్వ‌డంతో ఆ కిక్ ని మ‌ళ్లీ అన్నాత్తే అందించింది. సూప‌ర్ స్టార్ లో మాసిజం మ‌రోసారి అంచ‌నాల్ని మించి ఉండ‌బోతుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

తాజాగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ టైటిల్ కూడా ఖ‌రారు అయింది.`పెద్ద‌న్న` అన్న‌ది తెలుగు టైటిల్ గా నిర్ణ‌యించారు. అన్నాచెల్లెళ్ల‌ అనుబంధం..కుటుంబ విలువ‌లు తెలిపే చిత్రం కావ‌డంతో పెద్ద‌న్న అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెబుతూ ఓ మాస్ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో ర‌జనీకాంత్ రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ మీద స్టైలిష్ గా క‌నిపించారు. ఒక చేతిలో క‌త్తి దూస్తున్న తీరు భ‌య‌పెడుతోంది. భారీ మాస్ యాక్ష‌న్ స‌న్నివేశం నుంచి ఎంపిక చేసిన స్టిల్ ఇది. ర‌జ‌నీ అభిమానుల నుంచి ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

అన్న‌ని ఇలా చూసుకుని చాలా కాల‌మ‌వుతోందంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈపోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ద‌స‌రా కాబ‌ట్టి చాలా సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ పెద్ద‌న్న పోస్ట‌ర్ మాత్రం చాలా ప్ర‌త్యేకంగా నిల‌బ‌డంది. ఇక పెద్ద‌న్న లో ర‌జ‌నీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తోంది. కీర్తి సురేష్.. మీనా..ఖుష్బూ.. జ‌గ‌ప‌తిబాబు..ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏషియ‌న్ ఇన్ ప్రా ఎస్టేట్స్ ఎ ల్ ఎల్ పీ నారాయ‌ణ‌దాస్ నారంగ్-సురేష బాబు చిత్రాన్ని తెలుగు..త‌మిళ లో రిలీజ్ చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.