రజనీ వెనక్కి తగ్గితే ఎవరికి మేలు?

Tue Nov 19 2019 19:36:52 GMT+0530 (IST)

Rajinikanth On About Darbar Movie Release Date

2020 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ తప్పేలా లేదు. ఇప్పటికే బన్నీ-మహేష్ మెజారిటీ థియేటర్లపై కర్చీప్ వేసేస్తున్నారు.  సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురములో క్లాష్ రావడంతో మహేష్ ఒక్క రోజు ముందుగా జనవరి 11న వచ్చే అవకాశాలున్నాయని ప్రచారమవుతోంది. ఇక బన్నీ యథావిధిగా అదే నెల 12వ తేదీని బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతాడట. అయితే మహేష్ - బన్ని బృందం రాజీ బేరానికి సంబంధించి సరైన సమాచారం రావాల్సి ఉందింకా. అయితే ఈలోగానే వీళ్లిద్దరికీ పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్  కూడా బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా జనవరి 12న దర్బార్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే తెలుగులో ఇద్దరు పెద్ద హీరోలు ఆ తేదీకే వస్తుండటంతో దర్బార్ రిలీజ్ లో వెనక్కి తగ్గారు.అదే నెల 15న లేదా జనవరి 10న కానీ దర్బార్ ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. కొంత డైలమా తర్వాత 10వ తేదీని లాక్ చేశారు. కానీ తాజా సమాచారాన్ని బట్టి దర్బార్ రిలీజ్ తేదీ మరోసారి మారింది. మహేష్-బన్ని కంటే ముందుగానే అంటే జనవరి 9న దర్బార్ రిలీజ్ చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అధికారిక వెబ్ సైట్ లో పేర్కోంది. దీంతో పోటీపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడో చిక్కు ఉంది. దర్బార్ ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి  హిట్టు టాక్ తెచ్చుకుంటేనే లాంగ్ రన్ ఉంటుంది. కేవలం రెండు రోజుల గ్యాప్ లో  సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో రిలీజవుతుండడం కలెక్షన్స్ కి బ్యాడ్ అవుతుంది. అవి బ్లాక్ బస్టర్ అన్న టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది.

దర్భార్ వల్ల ఆ ఇద్దరిపై పంచ్ పడుతుందా లేక ఆ ఇద్దరి వల్ల దర్బార్ పై పంచ్ పడుతుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఇక ఇటీవల రజనీ సినిమాలకు మరీ అంత సీన్ కనిపించడం లేదు కాబట్టి ఆ గ్యాప్ ని తగ్గించే సినిమా దర్బార్ అవుతుందా? అన్నది చూడాలి. జనవరి 9న దర్బార్.. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రాలు రిలీజ్ కానున్నాయని భావిస్తున్నారు. అయితే బన్ని- మహేష్ లలో ఎవరు వెనక్కి తగ్గారు ఎవరి తేదీ ఏది? అన్నది క్లియర్ కట్ గా తేలాల్సి ఉందింకా.