దర్బార్ లో సింహంలా గర్జించాడే

Wed Sep 11 2019 22:05:42 GMT+0530 (IST)

Rajinikanth Look In Darbar Movie

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా అది అభిమానులకు పండగే. 68 వయసులోనూ ఆయన అలుపన్నదే లేకుండా సినిమాల్లో నటిస్తూ రాజకీయారంగేట్రానికి రెడీ అవుతుంటే ఫ్యాన్స్ లోనూ అంతే ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీ `దర్బార్` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సహా రకరకాల పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. `దర్బార్` టైటిల్ కి తగ్గట్టే సూపర్ స్టార్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు.తాజాగా దర్బార్ సెకండ్ లుక్ సామాజిక మాధ్యమాల్లో రివీలైంది. ఇందులో రజనీ సింహగర్జన కనిపిస్తోంది. ఒక రకంగా రజనీ మార్క్ ముఖ కవలికలతో పోస్టర్ రక్తి కట్టిస్తోంది. అసలు వయసుతో సంబంధం లేకుండా చొక్కా విప్పి రజనీ చూపించిన గ్రేస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకి చిత్ర దర్శకుడు మురుగదాస్ అదిరిపోయే క్యాప్షన్ ని ఇచ్చారు. ``యంగర్.. స్మార్టర్.. వైజర్.. ఠఫ్పర్.. తలైవార్ నెవ్వర్ సీన్ బిఫోర్ అవతార్`` అంటూ మురుగ ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తానికి రజనీ న్యూలుక్ ఆకట్టుకుంది.

దర్బార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ లో పోలీసాఫీసర్ గా కత్తి పట్టుకుని కనిపించిన రజనీ వేరొక స్టిల్ లో సూటు బూటు తొడిగి దొరలాగా స్టైలిష్ గా కనిపించారు. తాజా లుక్ లో శత్రువుపై కోపంతో ఉగ్ర నరసింహంలా గర్జిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే రజనీ క్రేజు వేరు అని చెప్పాల్సిన పనే లేదు. రజనీ గత చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాని సాహో-సైరా హక్కుల్ని కొనుక్కున్న ఫర్స్ ఫిలింస్ సంస్థ విదేశాల్లో రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో నయనతార- నవాబ్ షా- సునీల్ శెట్టి- నివేదా థామస్- యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పేట తర్వాత రజనీకాంత్‌తో కలిసి వరుసగా రెండో చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.