రజనీకాంత్ మమమాస్ కాదు.. కకక్లాస్

Wed Jul 11 2018 12:11:17 GMT+0530 (IST)

Rajinikanth As Proffesor In Karthik Subbaraj Film

రజనీకాంత్ అనగానే ఊర మాస్ క్యారెక్టర్లే గుర్తుకొస్తాయి. మాస్ లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా వాళ్లకు రుచించే పాత్రలే రూపొందిస్తుంటారు రచయితలు.. దర్శకులు. మెజారిటీ ప్రేక్షకులు ఆయన్ని మాస్ పాత్రల్లోనే చూడాలనుకుంటారు. రజనీ లేటెస్ట్ మూవీ ‘కాలా’లోనూ ఆయన ఆ టైపు  పాత్రే చేశాడు. కానీ తన కొత్త సినిమాలో మాత్రం రజనీ ఇప్పటిదాకా చేయని విభిన్నమైన పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఆయన పక్కా క్లాస్ క్యారెక్టర్లోకి మారిపోతున్నట్లు తెలుస్తోంది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ స్టార్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రజనీ ఇప్పటిదాకా తన కెరీర్లో ఇలాంటి పాత్రే చేయలేదట. ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం.‘కాలా’ విడుదల రోజే డార్జిలింగ్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. నెల రోజుల పాటు అక్కడే షెడ్యూల్ జరిగింది. ఇటీవలే అక్కడ షూటింగ్ ప్యాకప్ చెప్పారు. మధురైలో రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుందంటున్నారు. విరామం లేకుండా నెల రోజులు షూటింగ్ లో పాల్గొన్న రజనీ.. ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్ ఓ కీలక పాత్ర చేస్తోంది. గత కొన్నేళ్లలో కోలీవుడ్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇందులో ఓ ముఖ్య పాత్ర చేస్తుండటం విశేషం. రజనీతో ఇంతకుముందు ‘రోబో’ లాంటి భారీ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్.. కొంత విరామం తర్వాత ఈ చిత్రంతోనే మళ్లీ కోలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నాడు.