Begin typing your search above and press return to search.

73లో నా ఆరోగ్య సూత్రం ఇదే: రజనీకాంత్

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 AM GMT
73లో నా ఆరోగ్య సూత్రం ఇదే: రజనీకాంత్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 73 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. అయితే ఈ వయస్సులో కూడా ఏ మాత్రం హుషారు తగ్గకుండా హీరోగా సినిమాలు చేస్తున్నారు. 73 ఏళ్ళ వయస్సులో ఎవరైనా కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి ఇక మరణం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే రజినీకాంత్ మాత్రం ఇప్పటికి కూడా యంగ్ హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. చివరిగా పెద్దన్న సినిమాతో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాని నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ ఇండియా నుంచి మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని చాలా యాక్టివ్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్నారు.

ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ మీటింగ్ లో ఆసక్తికర విషయాలు తన గురించి పంచుకున్నారు. 73 ఏళ్ళ వయస్సులో కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం నా భార్య లత అని పేర్కొన్నారు.

మద్యం, నాన్ వెజ్, సిగరెట్ కి నేను భాగా ఎడిక్ట్ అయిన టైంలో నా హెల్త్ కండిషన్ చూసి డాక్టర్లు కూడా రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకలేనని చెప్పేశారు. అయితే ఆ సమయంలో తన భార్య లతా తన ప్రేమతో నా అలవాట్లు అన్ని మానుకునేలా చేసింది. అలాగే నన్ను మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చింది. ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటే కచ్చితంగా దానికి సంబందించిన పూర్తి క్రెడిట్ నా భార్యకే ఇస్తాను అని పేర్కొన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే రజినీకాంత్ రెండేళ్ళ క్రితం రాజకీయాలలోకి వెళ్లాలని అనుకున్నారు. పార్టీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు.

అయితే తన అనారోగ్య కారణాల కారణంగా కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రజినీకాంత్ తెలిపారు. ఇలా తన జీవితంలో కీలక విషయాలని కుటుంబ సభ్యుల కోరిక మేరకు వదులుకోవడం రజినీకాంత్ లో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.