Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్ లో నట కిరీటి

By:  Tupaki Desk   |   29 Nov 2021 9:47 AM GMT
భీమ్లా నాయక్ లో నట కిరీటి
X
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అవుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈసినిమాలో కీలక పాత్రలో రానా కనిపించబోతున్న విషయం తెల్సిందే. పవన్ మరియు రానాల మద్య ఉండే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని.. ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. సినిమాలో పవన్ కు భార్య పాత్రలో నిత్యా మీనన్ కనిపించబోతుంది.

ఆమె లుక్ మరియు ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ కనిపించబోతున్నాడు. ఆయన ఈమద్య కాలంలో కమెడియన్ గా మంచి పాత్రలను దక్కించుకుని నవ్వించాడు. కాని భీమ్లా నాయక్ సినిమాలో మాత్రం ఆయన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్‌ నటించిన పాత్రలకు భీమ్లా నాయక్ సినిమాలోని పాత్ర కాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్‌ కళ్యాణ్ మరియు రానాలు ఇద్దరి పాత్రలు కూడా చాలా ఆవేశ పరులు. వారిద్దరితో కనెక్షన్‌ ఉండే కీలకమైన పాత్రలో రాజకీయ నాయకుడి పాత్ర లో రాజేంద్ర ప్రసాద్‌ కనిపించబోతున్నాడట.

తెగ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో సీరియస్ లుక్ లో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన సినిమాలో కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఆయన అభిమానులు మరోసారి ఆయన నట విశ్వరూపంను చూస్తారని యూనిట్‌ వర్గాల వారు అంటున్నారు. భీమ్లా నాయక్‌ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

పవన్‌ మరియు కీలక నటీ నటుల పై ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమా పవన్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి కూడా నచ్చే విధంగా ఉంటుందని.. ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ రచన సహకారం అందించాడు. స్క్రీన్‌ ప్లే కూడా త్రివిక్రమ్‌ అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు నిరాశ పర్చుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితం సెంటిమెంట్‌ ను బ్రేక్‌ చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.