మా అసోసియేషన్ గొడవపై రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?

Mon Nov 18 2019 22:13:15 GMT+0530 (IST)

Rajendra Prasad On about Maa Controversy

తాజాగా మా అసోసియేషన్ లో గొడవలు జరగడం. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రెస్ మీట్లు వారు పెటుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈ గొడవలపై కొందరు సినీ ప్రముఖులు స్పందించి మాట్లాడారు కూడా.  అయితే లేటెస్ట్ గా ఈ గొడవలపై మా అసోసియేషన్ కు ఒకప్పుడు ప్రెసిడెంట్ గా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు.అసలు గొడవేంటి ? ఎక్కడ మొదలైంది అనేది తనకి పూర్తిగా తెలియదని సమస్య ఏదైనా మీటింగ్ పెట్టుకొని పెద్దల సమక్షంలో తీర్చుకోవాలి కానీ ఇలా రోడ్డెక్కి ఎంతో గౌరవం ఉన్న అసోసియేషన్ పరువు తీయకూడదని అన్నాడు. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటూ తనకు పిలుపు వచ్చిందని చెప్పుకున్నాడు రాజేంద్ర ప్రసాద్.

మరి ఈ సీనియర్ నటుడు ఒకప్పటి ప్రెసిడెంట్ చెప్పిన మాటలు మా అసోసియేషన్ వారికి చేరి ఏదైనా రిజల్ట్ ఉంటుందేమో చూడాలి.