సుమతో విభేదాలు వచ్చాయనే వార్తలపై రాజీవ్ కనకాల స్పందన..!

Tue Jul 27 2021 06:00:01 GMT+0530 (IST)

Rajeev Clarifies About Rumours Of His Split With Suma

బుల్లితెరపై రాణించిన దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాల.. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. మలయాళీ అయిన సుమ ను 1999లో ప్రేమ వివాహం చేసుకున్నాడు రాజీవ్. వీరికి రోషన్ - మనస్వీని అనే కొడుకు కుతూరు ఉన్నారు. అయితే ఆ మధ్య రాజీవ్ కనకాల - యాంకర్ సుమ మధ్య సంపాదన విషయంలో గొడవలు వచ్చి విడిపోయారని రూమర్స్ వచ్చాయి. దీనిపై అప్పుడే వీరిద్దరూ స్పందిస్తూ అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ ప్రోగ్రామ్ కు వచ్చి తమ మధ్య అలాంటివి ఏమీ లేవని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రీసెంటుగా మరోసారి రాజీవ్ కనకాల ఈ రూమర్స్ పై స్పందించారు.'నారప్ప' చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజీవ్ కనకాల.. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ కు తనకు విభేదాలు వచ్చాయనే వార్తల గురించి మాట్లాడుతూ..  ''సుమకు నాకు మధ్య అలాంటివి లేవు. మా అమ్మ చనిపోయిన తరువాత నేను నాన్నతో కలిసి మణికొండ ఇంటికి షిప్ట్ అయ్యాను. ఇల్లు ఖాళీ ఉండగా అపార్ట్మెంట్ కి ఎక్కువ రెంట్ చెల్లించి డబ్బులు వెస్ట్ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో మారాము. అలానే నాన్న దగ్గర పుస్తకాలు ఒక లైబ్రరీలో ఉన్నన్ని ఉంటాయి. వాటిని అపార్ట్మెంట్ లో ఉంచడం కంటే మణికొండ ఇంటికి షిప్ట్ అవడం మంచిదని అనుకున్నాను. నేను అక్కడి నుంచి ఇక్కడికి షటిల్ అయ్యే ఈ షట్లింగ్ అయ్యే క్రమంలో ఈ పుకార్లు వచ్చి ఉండొచ్చు'' అని చెప్పారు.

సంపాదన విషయంలో సుమకు రాజీవ్ కనకాలకు మధ్య బేధాలు వచ్చాయనే వార్తలపై కూడా ఆయన స్పందించారు. ''మా మధ్య అలాంటి బేధాలు ఎప్పుడూ రాలేదు. సుమ వర్కింగ్ విమెన్ కాబట్టి తనకు సంపాదన వస్తుంది. నాకు వచ్చేది నాకు వస్తుంది. అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. మనం అందరికీ సమాధానం చెబుతూ ఉండలేం. కానీ మా మధ్య అసలు అలాంటివి డిస్కషన్ లోకి రావు. ఇద్దరం వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తుంటాం అంతే'' అని రాజీవ్ కనకాల అన్నారు. నిజానికి సుమ సంపాదన తన కంటే ఎక్కువే అని.. అయితే తనకు కూడా వేరే ఆదాయ వనరులు ఉన్నాయని రాజీవ్ చెప్పుకొచ్చారు.