Begin typing your search above and press return to search.

కల్కి కోసం డియ్యో డియ్యో సెట్ అయిందయ్యో!

By:  Tupaki Desk   |   11 Jun 2019 6:19 PM GMT
కల్కి కోసం డియ్యో డియ్యో సెట్ అయిందయ్యో!
X
ఒక సినిమాలో కథ.. స్క్రీన్ ప్లే.. నటీనటులు.. టెక్నిషియన్లు ఎంత ముఖ్యమో ఐటెం నంబర్ కూడా అంతే ముఖ్యం. దాన్నే స్టైల్ గా ఈమధ్య స్పెషల్ సాంగ్ అంటున్నారు లెండి. కొందరు ఈ లాజిక్ తో విభేదిస్తారు కానీ అదే ఒక స్పెషల్ సాంగ్ కనుక నేపథ్యంలో ప్లే అయితే తమను తాము మర్చిపోయి పాదాలతో దరువేయడం మొదలుపెడతారు. అందుకే యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొత్త సినిమా 'కల్కి' కోసం ఒక కత్తి లాంటి ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు.

హార్న్ ఒకే ప్లీజ్ అంటూ సాగే ఈ ప్రత్యేక గీతాన్ని బ్రిటిష్ నటీమణి స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించారు. ఇంతకీ ఈ స్కార్లెట్ ఎవరని అనుమానం వచ్చిందా? ఆమె గతంలో 'ఎవడు' సినిమాలో ఒక పాటలోనూ .. బాహుబలిలో లో మరో పాట లోనూ రెచ్చిపోయి ఆనంద నర్తనం చేసింది.. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తాజాగా యాంగ్రీ స్టార్ తో కలిసి స్టెప్పులేసేందుకు తయారైంది. హార్న్ ఒకే ప్లీజ్ లిరికల్ సాంగ్ ను 12 వ తారీఖు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ 'కల్కి' టీమ్ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో రాజశేఖర్ బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ కలర్ జాకెట్ వేసుకొని స్టైలిష్ గా ఉండగా పక్కనే స్కార్లెట్ ఫోక్ స్టైల్ లో నాట్యం చేస్తోంది.

రాజశేఖర్ గత చిత్రం 'గరుడవేగ' లో డియ్యో డియ్యో సాంగ్ లో సన్నీ లియోన్ స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడమే కాకుండా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. మరి ఇప్పుడు ఈ హార్న్ ఒకే ప్లీజ్ ఆ సాంగ్ ను మ్యాచ్ చేస్తుందా అనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడక తప్పదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' చిత్రంలో అదా శర్మ.. నందితా శ్వేత.. పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.