Begin typing your search above and press return to search.

'రాజరాజచోర' ఓటిటి బాటపడుతోందా..?

By:  Tupaki Desk   |   20 Jun 2021 10:30 AM GMT
రాజరాజచోర ఓటిటి బాటపడుతోందా..?
X
ఈ మధ్యకాలంలో సినిమాలు ఎప్పుడు థియేట్రికల్ రిలీజ్ అవుతాయో.. ఎప్పుడు ఓటిటి రిలీజ్ అవుతాయో మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కోసారి ఓటిటి రిలీజ్ ఫిక్స్ అయ్యాక థియేట్రికల్ రిలీజ్ అని ప్రకటిస్తారు. కొన్నిసార్లు థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ఆనందించే లోపు ఓటిటి రిలీజ్ అనేస్తుంటారు. మరి ఇంతకీ ఏది కరెక్ట్ అని చెప్పడానికి ఇది మాములు పరిస్థితి కాదు. కరోనా సమయం కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ఓటిటి నుండి భారీ ప్రైస్ ఆఫర్స్ వస్తే మాత్రం కాదనలేకపోతున్నారు. అయితే వీరికి తగ్గట్టుగానే ఓటిటిలు కూడా రిలీజ్ చేస్తున్నాయి.

ఒకసారి ఓటిటికి హక్కులు ఇచ్చేసాక ఓటిటి వారు కూడా కొన్ని నేరుగా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని థియేట్రికల్ రిలీజ్ ఛాన్స్ ఉంటే మాత్రం ముందుగా థియేట్రికల్ రిలీజ్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులకు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యువహీరో శ్రీవిష్ణు నటించిన 'రాజరాజచోర' సినిమా కూడా అలాంటి సంధిగ్ధంలో పడినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కంటే కూడా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ ఏడాది గాలిసంపత్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు.. ఆ సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. మినిమం అంచనాలు సెట్ చేసినటువంటి ఆ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.

ప్రస్తుతం తన తదుపరి సినిమా 'రాజరాజచోర' సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కూడా ఈ సినిమాలో అంజవ్వగా కనిపించనుంది. శ్రీవిష్ణు 'భాస్కర్ రాజు' అనే క్యారెక్టర్ లో కనిపించనుండగా.. శ్రీవిష్ణు సరసన హీరోయిన్స్ గా సునయన - మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా హక్కులను జీ5 ఓటిటి వారు దక్కించుకున్నట్లు సమాచారం. సినిమా కూడా త్వరలో ఓటిటి రిలీజ్ కాబోతుందని వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయం పా మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. హసిత్ గోలి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు.