ఆ నిర్మాతతో రాజమౌళి సినిమా… ఎప్పుడంటే?

Wed Mar 29 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Rajamouli's film with that producer... when?

ఆస్కార్ విన్నింగ్ మూవీ దర్శకుడిగా రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ కి తన బ్రాండింగ్ ని పెంచుకున్నాడు. ఈ నేపధ్యంలో రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో భారీ అంచనాలు ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. నెక్స్ట్ రాజమౌళి కెఎల్ నారాయణతో రాజమౌళి హీరోగా పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నారనే సంగతి అందరికి తెలిసిందే.ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ అడ్వంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇక హాలీవుడ్ స్టార్స్ ని ఈ మూవీ కోసం జక్కన్న రంగంలోకి దించుతున్నాడు. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది మార్చి తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రాజమౌళి తాజాగా మరో నిర్మాతతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సారి తెలుగులో కాకుండా కన్నడ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థలో మూవీ చేయడానికి ఒకే చెప్పాడు హోంబలే ఫిలిమ్స్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్.

ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి గత ఏడాది సుదీప్ విక్రాంత్ రోనా మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక ధృవ్ సర్జాతో కేడీ అనే మరో పాన్ ఇండియా మూవీ కూడా ఈ ప్రొడక్షన్  హౌస్ లో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉండగా శిల్పాశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. వీటికంటే ముందుగా కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో రైడర్ అనే సినిమా తెరకెక్కించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరో రెండు చిన్న సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడ థీయాట్రికల్ రైట్స్ ని ఈ నిర్మాణ సంస్థ దక్కించుకొని రిలీజ్ చేసింది.

అప్పుడే రాజమౌళితో సదరు నిర్మాతలకి పరిచయం ఏర్పడటం జరిగింది. ఆ రిలేషన్ తోనే వారితో సినిమా చేయడానికి జక్కన్న ఒప్పందం చేసుకున్నాడు అనే మాట కూడా వినిపిస్తుంది. ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయ్యాక ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అది ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అయ్యి ఉండొచ్చు అని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.