Begin typing your search above and press return to search.
రాజమౌళి అండ్ కో రెండు నెలలు రెస్ట్!
By: Tupaki Desk | 21 March 2023 5:00 AMఆస్కార్ కోసం దర్శకశిఖరం రాజమౌళి అండ్ కో అమెరికాలో ఎంతగా శ్రమించిందో తెలిసిందే. అవార్డు వేడుకకకు నాలుగైదు నెలలు ముందుగానే లాస్ ఎంజెల్స్ లో తిష్ట వేసి 'ఆర్ ఆర్ ఆర్' కి కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చి నాటు నాటు ని నామినేట్ చేయగల్గారు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. రేయింబవళ్లు శ్రమించారు. భారత్ నుంచి అధికారికంగా మరో సినిమా నామినేట్ అయినా దాంతో సంబంధం లేకుండా శక్తివంచన లేకుండా శ్రమించి 'ఆర్ ఆర్ ఆర్' కి ఆస్కార్ తీసుకురావడంలో జక్కన్న కీలక పాత్ర పోషించారు.
చివరిగా నామినేట్ అయినా అవార్డు వస్తుందా? రాదా? అన్నది మరో టెన్షన్. చివరికి అన్నింటిని దాటుకుని దేశం మీసం తిప్పేలా చేసారు. అటుపై ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత సంబురాల్లో నూ మునిగి తేలారు. భారీ ఈవెంట్లు అంటూ ఏమీ చేయకపోయినా సన్నిహితులు-స్నేహితులు-చుట్టాలు-పక్కాలు కాస్త హడావుడి చేసినట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తున్నట్లు? అంటే ఆయన విశ్రాంతి తీసుకుంటు న్నట్లు సమాచారం.
కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకపోవడంతో రెండు నెలలు పాటు పూర్తిగా కుటుం బంతోనే గడపాలని భావిస్తున్నారు. ఎలాంటి వెకేషన్ల కు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉండి చిల్ అవ్వాల న్నది ప్లాన్ గా తెలుస్తుంది. రాజమౌళి పార్టీలంటూ బయటకు వెళ్లరు. ఏదైనా కుటుంబం.. బంధువులతోనే గెట్ టూ గెదర్ అవుతుంటారు. ఈ తంతు పూర్తయిన వెంటనే జక్కన్న మహేస్ సినిమా పనుల్లో బిజీ కానున్నట్లు తెలుస్తుంది.
ఈ లోగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్ర్కిప్ట్ కి సంబంధించి తుది వెర్షన్ కూడా సిద్దం చేసి పెట్టనున్నారుట. రెండు నెలలు తర్వాత ఫైనల్ వెర్షన్ కూడా వినేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. అయితే ఆ కథకి అదనపు హంగులు..అవసరమైన మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.