ఆస్కార్ పాస్ ల కోసం ఒకొక్కరికి రూ.20 లక్షలు జక్కన్న ఖర్చు..?

Fri Mar 17 2023 10:45:21 GMT+0530 (India Standard Time)

Rajamouli Spent 20 Lakhs For Each Oscar Pass

రాజమౌళి పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా తరపున అధికారికంగా నామినేషన్స్ దక్కించుకోకున్నా కూడా నేరుగా ఆస్కార్ ఎంట్రీకి పంపించాడు. నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా జక్కన్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి రూ.80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంటూ కొందరు విమర్శించిన విషయం కూడా తెలిసిందే.ఆస్కార్ అవార్డు కోసం జక్కన్న టీం చేసిన ప్రచారానికి ఎంత ఖర్చు అయిందనే విషయమై క్లారిటీ లేదు కానీ మొత్తం ఆస్కార్ అవార్డు వేడుకను చూసేందుకు జక్కన్న కుటుంబ సభ్యులతో పాటు యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్న విషయం తెల్సిందే. నామినేషన్ పొందిన కారణంగా కొంత మందికి ఉచిత పాస్ లు లభించి ఉంటాయి. కానీ ఎక్కువ మంది వేడుకలో పాల్గొనాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుందట.

ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ లో కొందరు అదనంగా ఆస్కార్ వేడుకను చూసేందుకు వెళ్లారు. అదనంగా వెళ్లిన ఒకొక్కరి పాస్ ల కోసం దాదాపుగా 25 వేల డాలర్లను ఖర్చు చేశారట.

ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా 20 లక్షల రూపాయలను కేవలం ఒక్కరి కోసం ఖర్చు చేయడం జరిగిందట. అలా ఎంత మంది అదనంగా వెళ్లారనేది క్లారిటీ రావాల్సి ఉంది.

మొత్తానికి జక్కన్న భారీ మొత్తంలో ఖర్చు చేసి భారతీయుల ఆస్కార్ కలను నెరవేర్చారు. ఈ మొత్తంను చిత్ర నిర్మాత దానయ్య కాకుండా స్వయంగా రాజమౌళి ఖర్చు చేశారని తెలుస్తోంది. దానయ్య ఈ మొత్తం అవార్డు వేడుకల వ్యవహారానికి దూరంగా ఉన్న విషయం తెల్సిందే. కనుక రాజమౌళి టీం మొత్తం ఖర్చు పెట్టి ఉంటారనేది అందరూ అనుకుంటున్న విషయం.

ఖర్చు కు భయపడకుండా జక్కన్న సినిమాలు తీస్తాడు కనుకే ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి.. అలాగే జక్కన్న ఆస్కార్ కోసం ఖర్చుకు వెనకాడకుండా పెట్టాడు కనుకే దేశం మొత్తం గర్వించే అవార్డును సొంతం చేసుకున్నాడు. కనుక ముందు ముందు కూడా జక్కన్న పెట్టే ఖర్చు ను ఎవరు ప్రశ్నించకుండా ఉంటే బెటర్.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.