Begin typing your search above and press return to search.

మ‌హేష్- ప్ర‌భాస్ తో పాన్ ఇండియా ప్లాన్?

By:  Tupaki Desk   |   16 Feb 2020 5:00 AM GMT
మ‌హేష్- ప్ర‌భాస్ తో పాన్ ఇండియా ప్లాన్?
X
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. టాలీవుడ్ హంక్ రానాల‌ను ఒకేతాటిపైకి తీసుకొచ్చి `బాహుబ‌లి` తెర‌కెక్కించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద‌నే స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పాడు జ‌క్క‌న్న‌. జాతీయ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు... రివార్డుల‌తో జ‌క్క‌న్న పేరు మార్మోగింది. రాజ‌మౌళి అంటే ఇండియాలోనే ఓ బ్రాండ్ అని ముద్ర ప‌డింది. పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను కొన‌సాగిస్తూ ప‌క్కా ప్లానింగ్ తో వెళుతున్నారు జ‌క్క‌న్న‌. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లు రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఇద్ద‌రు గొప్ప విప్ల‌వ యోధుల అల్లూరి సీతారామరాజు.. కొమురం భీమ్ క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకుని ఫిక్ష‌న్ కంటెంట్ తో ఆర్.ఆర్.ఆర్ ని తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో భారీ అంచ‌నాల న‌డుమ‌ తెర‌కెక్కుతుంది.

ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచేలా జ‌క్క‌న్న ప్లాన్ ని డిజైన్ చేశార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇంత గ్రేట్ మూవీ త‌ర్వాత‌ జ‌క్క‌న్న ప్లాన్ ఎలా ఉంది? ఏ హీరోతో సినిమా చేస్తాడు? పాన్ ఇండియా సినిమాల‌కే ప్రాధాన్య‌త‌నిస్తారా? అంటే.. దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు. ఈ సందేహాల‌కు రాజ‌మౌళి నుంచి ఆన్స‌ర్ లేదు కానీ.. సీనియ‌ర్ సినీ పాత్రికేయుడు ఇమంది రామారావు త‌నదైన గెస్ ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. రాజ‌మౌళితో ప‌ని చేసే త‌దుప‌రి హీరోల పేర్ల‌ను రివీల్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ ..రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి మ‌రో పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కిస్తార‌ని అన్నారు.

ఇద్ద‌రి ఇమేజ్ ల‌కు త‌గ్గ అదిరిపోయే స్క్రిప్ట్ ను స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాస్తున్నారట‌. జ‌క్క‌న్న య‌థావిథిగా త‌న పాత టెక్నిక‌ల్ టీమ్ తోనే ముందుకు వెళ్తాడ‌ని పెద్దాయ‌న అన్నారు. ఇప్ప‌ట్లో జ‌క్క‌న్న‌కు బాలీవుడ్ కి వెళ్లే ఆలోచ‌న లేదు. పాన్ ఇండియా సినిమాలు తీస్తారు. అలాగే హీరోయిన్లుగా మాత్రం అనుష్క‌.. శ్రియ‌ల‌ను అస్స‌లు ఎంపిక చేయ‌రు. కొత్త వాళ్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. మ‌రి వెట‌ర‌న్ సినీపాత్రికేయుని వ్యాఖ్య‌ల్లో నిజం ఎంతో తెలియాలంటే విజ‌యేంద్ర ప్ర‌సాద్ కానీ రాజమౌళి కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా పెద్దాయ‌న ఈ లీకు అందిందా? అంటూ.. ఇమంది వ్యాఖ్య‌ల‌పై నెటి జ‌నులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.