చరణ్ బర్త్ డే కి జక్కన్న ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

Wed Mar 29 2023 15:49:17 GMT+0530 (India Standard Time)

Rajamouli Family Gift to RamCharan on Birthday

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. బర్త్ డే పార్టీలో రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఎవరి బర్త్ డేకు వెళ్లినా కూడా రాజమౌళి ప్రత్యేకమైన బహుమానాలను ఇవ్వడం జరుగుతుంది.



తాజాగా చరణ్ బర్త్ డేకు హాజరు అయిన రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ వుడ్ వర్క్ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చారు. రోజ్ వుడ్ తో తయారు చేసిన ఒక లారీ వంటి బొమ్మను మరియు అలాగే రోజ్ వుడ్ తో తయారు చేసిన విభిన్నమైన ప్రతిమను కూడా జక్కన్న ఫ్యామిలీ వారు చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.

రాజమౌళి తనయుడు కార్తికేయ చేతిలో రోజ్ వుడ్ బొమ్మను చూడవచ్చు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జక్కన్న గత ఏడాది కూడా చరణ్ కు అరుదైన బర్త్ డే కానుకను ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయి ఆస్కార్ అవార్డ్ తర్వాత చరణ్ బర్త్ డే చాలా స్పెషల్ గా నిలిచింది.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేసి ఇటీవలే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

మొత్తానికి రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమా బుచ్చి బాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.