Begin typing your search above and press return to search.

మేమ్ ఫేమస్.. రాజమౌళి కూడా ఫిదా!

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 PM GMT
మేమ్ ఫేమస్.. రాజమౌళి కూడా ఫిదా!
X
ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా మేము ఫేమస్. ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. సినిమా చాలా బాగుందనే కామెంట్స్ బాగా వినపడుతున్నాయి.

మూవీ ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా, చాలా మంది నెటిజన్లు హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ మూవీపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. మూవీ బాగుందని కామెంట్స్ చేయడంతో పాటు, సుమంత్ పై ప్రశంసల వర్షం కూడా కురిపించారు.

'చాలాకాలం తర్వాత థియేటర్ లో మంచి సినిమాను ఎంజాయ్ చేశాను. ఈ అబ్బాయి సుమంత్ కోసం ఈ సినిమా చూడొచ్చు. నటుడిగా, దర్శకుడిగా సుమంత్ కి మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పాత్రలు చాలా చక్కగా డిజైన్ చేశారు.నటీనటులు చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ క్యారెక్టర్ చాలా బాగుంది. యువతను ప్రోత్సహంచాలి. ధమ్ ధమ్ చేయకూడదు' అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం విశేషం.

మూవీ విడుదలకు ముందు మహేష్ కూడా తన ట్విట్టర్ లో ఈ మూవీ గురించి ప్రస్తావించారు. మేము ఫేమస్ సినిమా చూశానని, చాలా అద్భుతంగా ఉందని మహేష్ ట్వీట్ చేయడం విశేషం.

హీరో, డైరెక్షన్, నటీనటుల నటన అద్భుతమని ఆయన ఈ మూవీపై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ టాలెంట్ కి మహేష్ ఫిదా అయిపోయారు. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ లో చెప్పారు.

మూవీకి ముందు చాలా మంది హీరోలతో ప్రమోట్ చేయించారు. రిలీజ్ సమయంలో మహేష్ తో, రిలీజ్ తర్వాత రాజమౌళితో ప్రమోట్ చేయిస్తున్నారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మూవీ నిజంగానే బాగుందని చెబుతున్నారు. నెగిటివిటీ ఎలా ఉన్నా, మూవీ మాత్రం హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.