Begin typing your search above and press return to search.

150 కోట్ల వ‌సూళ్ల సినిమా రీమేక్ అంటే మాట‌లా?

By:  Tupaki Desk   |   18 May 2020 5:30 AM GMT
150 కోట్ల వ‌సూళ్ల సినిమా రీమేక్ అంటే మాట‌లా?
X
యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ఎగుడుదిగుడు కెరీర్ జ‌ర్నీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎంత స్పీడ్ గా ఎదిగాడో... అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు. స‌క్సెస్ ని నిల‌బెట్టుకోవ‌డం అన్న‌ది బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల‌కు అతి పెద్ద స‌వాల్ లాంటిది. అయితే అదృష్ఠ‌వ‌శాత్తూ స‌క్సెస్ ఒక్క‌టే చూడ‌కుండా అవ‌కాశాలిచ్చే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌న‌కు ఉన్నారు. ఆప‌ద‌లో ఆప‌న్న‌ హ‌స్తం ఇచ్చేవాళ్లు ఉన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రాజ్ త‌రుణ్ హోప్ ఏది? అంటే.. క‌చ్ఛితంగా దిల్ రాజు- సురేష్ బాబు లాంటి నిర్మాత‌ల సాయం ఎప్పుడూ అత‌డికి ఉంది.

రాజ్ త‌రుణ్ హీరోగా అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు `డ్రీమ్ గ‌ర్ల్` రీమేక్ కి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు స‌హా ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్త‌య్యాయి. లాక్ డౌన్ లేక‌పోతే ఈపాటికే మెజారిటీ షూటింగ్ చేసేసేవారే. కార‌ణం ఏదైనా వాయిదా ప‌డ‌డం రాజ్ త‌రుణ్ కి ఇబ్బంది క‌రంగానే మారింది. మ‌రోవైపు అత‌డు అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా సేమ్ ప‌రిస్థితి. లాక్ డౌన్ తీసేస్తే ఇవి రెండూ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుంటాయి.

అయితే `డ్రీమ్ గ‌ర్ల్` లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో రాజ్ త‌రుణ్ ఏ మేర‌కు మెప్పించ‌గ‌ల‌డు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా యువ‌త‌రంలో సాగుతోంది. ఇది నిజంగా ఈ యంగ్ హీరోకి స‌వాల్ లాంటిది. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా అద్భుతం గా న‌టించాడు. స్మార్ట్ యుగంలో అమ్మాయి కాని అమ్మాయిగా అబ్బాయిల్ని ఆడుకునేవాడిగా అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నందుకు రాజ్ త‌రుణ్ అందుకు త‌గ్గ గ్రౌండ్ వ‌ర్క్ చేయాలి. పైగా అక్క‌డ 150 కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమా డ్రీమ్ గ‌ర్ల్. ఈ సినిమాని తెలుగు యూత్ డిజిట‌ల్ - ఓటీటీ వేదిక‌ల‌పై ఇప్ప‌టికే చూసేశారు. అందువ‌ల్ల పోలిక చూడ‌డం అన్న‌ది ఇబ్బంది క‌రంగానే ఉంటుంది. అందుకే నిర్మాత‌ సురేష్ బాబు రీమేక్ విష‌య‌మై చాలానే జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. ఇక ఈ సినిమాతో పాటు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిందీ చిత్రం `సోను కి టిటులీకి స్వీటీ` రీమేక్ కి సురేష్ బాబు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.