రాజ్ కుంద్రా కేసులో బిగ్ ట్విస్ట్

Sun Jul 25 2021 17:42:04 GMT+0530 (IST)

Big twist in the Raj Kundra case

అశ్లీల చిత్రాలు తీశాడనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా వ్యవహారంలో తవ్వే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే లాక్ డౌన్ లో ఆయన ప్రజల ఖాళీ టైంను క్యాష్ చేసుకుందని భారీగా అశ్లీల చిత్రాలు తీసిన విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ క్రమంలోనే కేసును మరింత లోతుగా క్రైం బ్రాంచ్ పోలీసులు అన్వేషిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా సోదాలు జరిపిన పోలీసులకు సీక్రెట్ కబోర్డ్ షాక్ కు గురిచేసింది. ఇందులో ఎన్నో విలువైన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.

తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ బృందం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు తెలుస్తోంది. ఇక వాటికి ఖర్చు కూడా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..ఇ క కేసును మరింత సీరియస్ గా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తీసుకున్నారు. అధికారులు ఏమాత్రం పట్టువిడవడం లేదు.

రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ ముగియడంతో ప్రవేశపెట్టారు.

ముంబైలోని అంధేరిలో ఉన్న వియాన్ అండ్ జేఎల్ స్ట్రీమ్ ఆఫీసులో క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఇందులో వాళ్లకు ఓ సీక్రెట్ కబోర్డ్ కనిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జులై 19నే అక్కడి వాళ్లు వెతకగా ఇది కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురిని శనివారం ప్రశ్నించడంతో వాళ్లు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం.

ఆ సీక్రెట్ గా దాచిన కప్ బోర్డులో క్రైం బ్రాంచ్ అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. పోలీసులకు లభ్యమైన వాటిలో ఎక్కువభాగం క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలే ఉన్నట్లు సమాచారం. వాటితోపాటు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా దొరికాయంటున్నారు. దీంతో కుంద్రా పుట్ట పెద్దదే అని పోలీసులు అంటున్నారు.

పత్రాలను ప్రస్తుతం పోలీసులు పరిశోధిస్తున్నారు. అందులో మోడళ్లు హీరోయిన్లతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? అన్న దిశగా వాళ్లు అన్వేషణ జరుపుతున్నారట.. అశ్లీల చిత్రాలకు సంబంధించిన ఆధారాలను ఇందులో వెతికే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.