Begin typing your search above and press return to search.

ర‌త్తాలు బిగి స‌డ‌ల‌ని అందాల జాత‌ర‌

By:  Tupaki Desk   |   8 Jun 2021 7:30 PM GMT
ర‌త్తాలు బిగి స‌డ‌ల‌ని అందాల జాత‌ర‌
X
ర‌త్తాలు ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. కుర్ర‌కారుకు గుండెల్లో జిల్ల‌నిపించే ట్రీట్ ఇవ్వ‌డంలో రాయ్ ల‌క్ష్మి అలియాస్ ర‌త్తాలు త‌ర్వాతే. ఇటీవ‌ల గ‌త కొంత‌కాలంగా మ‌హ‌మ్మారీ క్రైసిస్ వ‌ల్ల ఈ బ్యూటీకి కావాల్సినంత తీరిక స‌మ‌యం చిక్కింది. దీంతో వ‌రుస ఫోటోషూట్ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.

ఇటీవ‌ల బ‌ర్త్ డే పార్టీ త‌ర్వాత‌ అగ్గి రాజేసే బికినీ ఫోటోల‌తో దుమారం రేపిన రాయ్ ల‌క్ష్మి తాజాగా ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ని రివీల్ చేసింది. ఈ ఫోటోల్లో రాయ్ ల‌క్ష్మి బిగి అందాల ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల్ని యువ‌త‌రం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఇక సోష‌ల్ మీడియాల్లో దాదాపు 12ఏళ్ల త‌ర్వాత‌ రాయ్ ల‌క్ష్మి ఎక్స్ బోయ్ ఫ్రెండ్ ఎం.ఎస్.ధోని గురించి ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. అత‌డు సాక్షిని పెళ్లాడ‌క ముందు రాయ్ ల‌క్ష్మితో 2008లో డేటింగ్ చేశాడు. ఆ విష‌యాన్ని చాలా కాలం దాచినా కానీ ఒకానొక సంద‌ర్భంలో ఒప్పుకున్నాడు కూడా. దుర‌దృష్టవ‌శాత్తూ ట్యాలెంటెడ్ ధోనీని రాయ్ ల‌క్ష్మి మిస్ చేసుకుంది కానీ.. ఈరోజు ఇలా సినీ ఛాన్సుల కోసం ఇంత‌గా శ్ర‌మించాల్సిన ప‌నే ఉండేది కాదు! అంటూ కొంద‌రు అభిమానులు ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోల‌ను అంత‌ర్జాలంలో షేర్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.