Begin typing your search above and press return to search.

ఫైట్ మాస్ట‌ర్ కొడుకు ఈసారైనా హిట్ కొడ‌తాడా..?

By:  Tupaki Desk   |   8 Jun 2021 2:30 PM GMT
ఫైట్ మాస్ట‌ర్ కొడుకు ఈసారైనా హిట్ కొడ‌తాడా..?
X
ఫైట్ మాస్టర్ విజ‌య్ కొడుకు రాహుల్ విజ‌య్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'ఈ మాయ పేరేమిటో' అనే సినిమాతో పరిచయమైన రాహుల్.. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక తో కలిసి 'సూర్యకాంతం' అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ రెండూ కూడా యువ హీరోకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో 'కాలేజ్ కుమార్' అనే కన్నడ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేసినా లాభం లేకుండా పోయింది. రాహుల్ విజయ్ హీరోగా చేసిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. ఈసారి ''పంచ‌తంత్రం'' అనే ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తున్నాడు.

రాహుల్‌ విజయ్ - శివాత్మిక రాజశేఖర్ - సముద్రఖని - బ్రహ్మానందం ప్రధాన పాత్రలతో ‘పంచతంత్రం’ సినిమా రూపొందుతోంది. హర్ష పులిపాక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టికెట్‌ ఫ్యాక్టరీ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై అఖిలేష్‌ వర్ధన్ - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో సోమవారం రాహుల్‌ విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్‌ అనే యువకుడి పాత్రలో రాహుల్‌ నటిస్తున్నాడు.

పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఈతరం యువతకు ఉండే కన్ఫ్యూజన్, క్లారిటీని 'పంచతంత్రం' చిత్రంలో రాహుల్ పాత్రతో చూపించనున్నామని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్‌ కె.నల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న రాహుల్ విజయ్ ఈసారైనా హిట్ కొడ‌తాడేమో చూడాలి.