అషు నా నెంబర్ బ్లాక్ చేస్తుందిః రాహుల్

Mon Jan 25 2021 13:10:04 GMT+0530 (IST)

Rahul Sipligunj Talking About Relationsship With Ashu Reddy

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ అయిన రాహుల్ సిప్లిగంజ్ మరియు అషురెడ్డిల విషయం ఈమద్య కాలంలో తెగ ట్రెండ్డింగ్ గా ఉంది. వీరిద్దరు పదే పదే సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో పాటు ఇద్దరు కూడా ఎక్కువగా బయటకు వెళ్లడం చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం చేస్తున్నారు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం ఏదో నడుస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే నెటిజన్స్ వీరిపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. కాని వీరిద్దరు మాత్రం బయట పడటం లేదు. తాజాగా వీరిద్దరు కలిసి ఒక వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.మేము ఇద్దరం కూడా ఒకే రకమైన మనస్థత్వంను కలిగి ఉన్నాం. ఆ కారణంగా ఇద్దరం ఎప్పుడు బయటకు తిరుగుతూనే ఉంటాం. ప్రతి రోజు బయటకు వెళ్లి టైమ్ పాస్ చేయాలనుకుంటాం. మా ఇద్దరి మద్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా మా మద్య గొడవలు అవ్వడం ఆ సమయంలో అషు నా నెంబర్ ను బ్లాక్ చేసి నా ఇన్ స్టా ను అన్ ఫాలో చేయడం చేస్తుంది. తనే మళ్లీ కొన్ని రోజుల తర్వాత కూల్ అయ్యి కాల్ చేసి బయటకు వెళ్దాం అని అడుతుంది. ఇలా మా ఇద్దరి మద్య స్నేహం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. తనకు అషు గర్ల్ ఫ్రెండ్ అంటూ రాహుల్ అనగా.. రాహుల్ నాకు ఫ్రెండ్ కు మించి అంటూ అషు కామెంట్స్ చేసింది. మొత్తానికి వీరిద్దరి మద్య వ్యవహారం పూర్తిగా రివీల్ చేయకుండా మెల్ల మెల్లగా క్లారిటీ ఇస్తున్నారా ఏంటీ అనిపిస్తుంది.